తమిళనాడులో అలా ఎలా?: సింగరేణిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణలో సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మరోసారి కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలన్నారు కేటీఆర్(KTR). బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణి(Singareni)కి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
తమిళనాడులో 3 లిగ్నైట్ గనులను వేలం నుంచి తప్పించారని పేర్కొన్న కేటీఆర్.. సింగరేణి కాలరీస్ కోసం ఇదే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు గనులను వేలం జాబితా నుంచి కేంద్రం తప్పిస్తున్నట్లు ఓ జాతీయ మీడియా రాసిన వార్తను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఒకే దేశంలో ఉన్న రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే వేలంలో టెండర్లు దాఖలు చేసి బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనులను వేలం వేయడానికి మార్చి నెల 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గనులపై ఏప్రిల్ 12న ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తామని, ఆసక్తి గల ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీలు హాజరై టెండరు ప్రక్రియ వివరాలు తెలుసుకోవాలని కేంద్ర బొగ్గు శాఖ తాజాగా మరో నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
This👇is exactly what we have been demanding & protested even today for Singareni Collieries
— KTR (@KTRBRS) April 8, 2023
That 4 Coal mines of Telangana be removed from auction list & allocated Directly to SCCL
Why different rules for different states in the same country? #Singareni pic.twitter.com/0rOtdVKle8
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన క్రమంలో సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలతోపాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అయితే, సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం ఉండగా.. కేంద్రం వాటా 49 శాతం ఉంది. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ఎలా ప్రైవేటు పరం చేస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారే ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications