భట్టి మాటలు విని డబ్బులు పోగొట్టుకోవద్దు: ప్రజా పాలన దరఖాస్తులపై కేటీఆర్ హెచ్చరిక

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తులు రోడ్లపై పడివుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా పాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన డేటా విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రజా పాలన దరఖాస్తుల డేటా బహిర్గతం కావడంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి సూచించారు. ప్రైవేటు ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగా ప్రజాపాలన దరఖాస్తులు బహిర్గతమైనట్లు వస్తున్న వార్తలను చూశానని కేటీఆర్‌ అన్నారు. ఆ అప్లికేషన్స్‌లో కోట్లాదిమంది తెలంగాణ ప్రజల సెన్సిటివ్‌ డేటా ఉందని పేర్కొన్నారు.

 ktr urges the telangana people for dont share otp or bank details, if someone offering to give 6 guarantees

ఈ సమాచారం సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎవరైనా కాల్‌ చేసి ఆరు గ్యారంటీలు మంజూరయ్యాయని.. ఓటీపీ అడిగితే చెప్పవద్దని తెలంగాణ సోదరసోదరీమణులను సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా.. ఓటు వేయకపోయినా సరే.. తన మాటలను సీరియస్‌గా తీసుకుని సైబర్‌ నేరగాళ్ల బారిన పడవద్దని కోరారు.

కొంతమంది ప్రయివేటు వ్యక్తులు ప్రజాపాలన దరఖాస్తుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని... ఇందుకు సంబంధించి వీడియోలను చూస్తున్నానని... అలాగే పలువురి నుంచి వింటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తు పత్రాలలో కోట్లాది తెలంగాణ ప్రజల సున్నితమైన డేటా ఉందని గుర్తు చేశారు. ఈ రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

'ప్రియమైన తెలంగాణ సోదర, సోదరీమణులారా... ఎవరైనా మీకు పెన్షన్ లేదా ఇల్లు లేదా ఆరు గ్యారంటీలలో ఏదైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటీపీని లేదా బ్యాంకు వివరాలను షేర్ చేయవద్దని కేటీఆర్ హెచ్చరించారు. డీప్యూటీ సీఎం మల్లు భట్టి మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారా? లేదా ఇతర పార్టీకి వేశారా? అనే దాంతో సంబంధం లేదు. కానీ, సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా నా మాటలను తీవ్రంగా పరిగణించాలని.. సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+