కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, హైడ్రాపై మార్పు లేదంటూ దానం
హైదరాబాద్ ఈ కార్ రేసింగ్, హైడ్రాపై తాను చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే అన్నానని తెలిపారు. ఈ కార్ రేసు వ్యవహారంలో అవినీతి జరగలేదని తాను చెప్పలేదన్నారు.
తాను ఫైటర్‌నని.. ఉపఎన్నికలకు భయడనని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడో జరిగిన అంశంపై స్టేట్మెంట్ ఇచ్చాను. హైడ్రాపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాను. దాన్ని కొంతమంది మీడియా వాళ్లు చెడుగా ప్రచారం చేస్తున్నారన్నారు దానం నాగేందర్. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తానేమీ కేటీఆర్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ఈ కార్ రేస్ పెట్టినప్పుడు కేటీఆర్ తన సలహా తీసుకున్నారని.. దానిపై తన ఒపీనియన్ మాత్రమే చెప్పానని దానం నాగేందర్ వివరించారు.

ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని దానం నాగేందర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటంతో కొన్ని సంస్థలు ఇక్కడ సెటిలయ్యాయన్నారు. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబైకి వెళ్లే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నార. కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి తాను దానిపై మాట్లాడను అని అన్నారు.
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర బడ్జెట్ ఖాళీగా ఉంది. కానీ, కాం్గరెస్ ఇచ్చిన హామీలను ఎలాగైనా అమలు చేయలని ముందుకెళ్తోంది. రైతు రుణ భరోసా చేసిన రోజు ఎంతో సంబరాలు చేయాల్సి ఉండే.. కానీ, చేయలేదన్నారు దానం నాగేందర్. ఇక,హైడ్రాపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. హైడ్రాపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని దానం నాగేందర్ సూచించారు.
మూసీపీ కంటి తుడుపు చర్యల్లాగా బీజేపీ నేతలు ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని దానం నాగేందర్ విమర్శించారు. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందు ఏసీలు పెట్టించుకుని పడుకున్నారని ఆరోపించారు. మూసీ ప్రాంతం వారి ఇళ్లల్లో చేసిన జొన్నరొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారని దానం చెప్పుకొచ్చారు.
మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు దానం నాగేందర్.












Click it and Unblock the Notifications