మాగంటి గోపీనాథ్ కొడుక్కి చివరి చూపును కూడా నోచుకోనివ్వని కేటీఆర్?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. నేతలంతా సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు అతి భయంకరంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలో గెలుపొందడంపై గంపెడు ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ కు మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమారుడు ఊహించనిరీతిలో షాక్ ఇచ్చారు. ఆ షాక్ కేటీఆర్ కు బాగా తగిలింది. గోపీనాథ్ కు రెండు ఫ్యామిలీలున్న విషయం తెలిసిందే. అయితే మొదటి భార్య కుటుంబం కాకుండా చిన్న భార్య సునీతను పోటీలో నిలబెట్టిన కేసీఆర్, కేటీఆర్ మొదటి భార్య కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక నీళ్లు నములుతున్నారు.
ఫోన్ నెంబరు చూపించాడు
సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన గోపీనాథ్ కొడుకు అనేక విషయాలను వెల్లడించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బెదిరించడం, తండ్రి ఆరోగ్యం బాగోలేదనే విషయాన్ని దాచడం, నాయనమ్మను, పెదనాన్నను, తమను ఆసుపత్రి వద్దకు కూడా అనుమతించకపోవడం లాంటి ఎన్నో విషయాలను సవివరంగా పంచుకున్నారు. సునీత ఫోన్ నెంబరు నుంచే ఆసుపత్రికి రావొద్దని ఫోన్ వచ్చిందని నెంబరు చూపించారు. టీఆర్ అండతో తమను ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేశారనే విషయాలను కూడా విపులంగా చెప్పాడు. అందుకు సంబంధించిన అన్ని వివరాలను విలేకరుల ఎదుట ప్రదర్శించి కావాలంటే చెక్ చేసుకోమని చెప్పారు.

ఎందుకు మౌనంగా ఉంటున్నారు
గోపీనాథ్ తల్లి కేటీఆర్ ను విమర్శించిన తర్వాత గోపీనాథ్ కొడుకు కూడా మీడియా సమావేశం పెట్టడంతో అనేక అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు గోపీనాథ్ మరణమే ఒక మిస్టరీగా మారిందంటున్నారు. దీనివెనక ఏం జరిగింది? ఎవరున్నారు? అనే విషయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలని కోరుతున్నారు. అయితే గోపీనాథ్ తల్లి ఆరోపణలపైకానీ, కొడుకు ఆరోపణలపై కానీ కేటీఆర కానీ, కేసీఆర్ కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలు కానీ ఎందుకు స్పందిచడంలేదనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఎంతోకొంత తప్పు ఉంటేనే కేటీఆర్ కానీ, మాగంటి సునీత కుటుంబం కానీ మౌనంగా ఉంటున్నారని, మౌనమే అర్థాంగీకరాంగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మాగంటి గోపీనాథ్ కొడుకు లేవనెత్తిన అనేక సందేహాలకు కేటీఆర్ సమాధానం చెబుతారా? లేదంటే సునీత సమాధానం చెబుతుందా? లేదంటే ఎన్నికలో ఓట్ల ద్వారా ప్రజలు సమాధానం చెబుతారా? అనేది తేలాల్సి ఉంది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
తెలంగాణాకు కొత్త టెన్షన్.. క్యాన్సర్ కేసులపై ఐసీఎంఆర్ షాకింగ్ నివేదిక! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications