మనవడికి కేసీఆర్ చిట్కాలు..
Kalvakuntla Himanshu Rao: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వంకుట్ల హిమాన్షు రావు పొలం పనుల్లో నిమగ్నం అయ్యాడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తాత కేసీఆర్ పర్యవేక్షణలో వ్యవసాయం నేర్చుకుంటోన్నాడు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్నాడు హిమాన్షు. అంతకుముందు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ను చదువుకున్నాడు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల‌్లో పట్టాను అందుకున్నాడు. అప్పట్లో జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మ కేసీఆర్, శోభ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్య హాజరయ్యారు.

కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్‌లోనూ హిమాన్షుకు సీఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. పెన్సిల్వేనియా పిట్స్‌బర్గ్‌లోని కార్నిగీ మెల్లాన్ యూనివర్శిటీలో చదువుకుంటోన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోన్నారు.
తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వ్యవసాయ పనుల్లో ప్రత్యక్షం అయ్యాడు హిమాన్షు. చేతిలో పలుగు, పారతో వ్యవసాయ పనులను చేయడంలో నిమగ్నం అయ్యాడు. మొక్కల కోసం గుంత తవ్వుతూ, వాటిని నాటుతూ కనిపించాడు. వాటికి చెదలు పట్టకుండా ఎరువులు చల్లాడు. వాటికి నీళ్లు పోశాడు.
హిమాన్షు పొలం పనుల్లో బిజీగా ఉంటే కేసీఆర్ పక్కనే నిల్చొని సూచనలు ఇచ్చారు. మొక్కల గురించి క్షుణ్నంగా వివరించారు. వ్యవసాయంలో అనుసరించాల్సిన చిట్కాల గురించి తెలియజేశారు. పొలం పనుల్లో తనకు ఉన్న అనుభవాన్ని, తెలిసిన మెళకువలను మనవడికి నేర్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను హిమాన్షు రావు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
Learning from the best ❤️🥰
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) January 16, 2025
Afforestation is essential to mitigate the effects of climate change, and we are responsible to protect and preserve our natural resources. pic.twitter.com/TreaW2inDm












Click it and Unblock the Notifications