కిరాతకం: భర్త ముందే కోర్కె తీర్చాలని ఒత్తిడి, నిరాకరించడంతో ఇలా.....
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త ఎదుటే ప్రియురాలిని హత్య చేశాడు ప్రియుడు.అడ్డువచ్చిన భర్తపై కూడ దాడి చేయడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
నిజామాబాద్: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త ఎదుటే ప్రియురాలిని హత్య చేశాడు ప్రియుడ.అడ్డువచ్చిన భర్తపై కూడ దాడి చేయడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.
నిజామాబాద్ జిల్లా జాకోర గ్రామానికి చెందిన కుంచెపు సాయవ్వ, తన భర్త, నాగయ్య, చిన్న కుమారుడు సాయికృష్ణతో కలిసి శుక్రవారం నాడు రాత్రి పది గంటల సమయంలో ఆరుబయట నిద్రించింది.
అయితే అదే గ్రామానికి చెందిన మాగిని చిన్న సాయిలు అనే వ్యక్తి భర్త కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సాయవ్వను నిద్రిలేపి తన కోర్కె తీర్చాలని కోరాడు.

అయితే సాయవ్వ అందుకు నిరాకరించింది. తన ఆరోగ్యం బాగాలేదని ఆమె సమాధానమిచ్చింది.దీంతో కోపోద్రిక్తుడైన చిన్న సాయిలు గొడ్డలిని తీసుకు వచ్చి సాయవ్వను నరికేశాడు. ఆమె ఛాతీపై, భుజంపై నరికాడు.
అడ్డుపడిన భర్త నాగయ్యపై కూడ దాడికి పాల్పడ్డాడు సాయిలు. నాగయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. చావు బతుకుల మధ్య ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నాలుగేళ్ళ క్రితం బతుకు దెరువు కోసం నాగయ్య దుబాయ్ కి వెళ్ళాడు.దీంతో సాయవ్వ నిందితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.ఏడాది క్రితం భర్త దుబాయ్ నుండి తిరిగొచ్చినా కాని ఆమె సాయిలుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు చెప్పారు.
ఇరవై రోజుల క్రితమే సాయవ్వ పెద్ద కొడుకు వివాహమైంది. సాయిలు పదిహేనేళ్ళ క్రితం తన భార్య పోశవ్వను కూడ ఇదే తరహలో గొంతు కోసి గాయపర్చాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications