ఏపీ- తెలంగాణ మధ్య పతాకస్థాయికి చేరిన జల జగడం

గోదావరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ సర్కార్ తన ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రిట్ పిటీషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నేడు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని ఈ సందర్భంగా న్యాయ నిపుణులకు సూచించారు. దీనికి అవసరమైన అన్నిఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు.

Legal Battle Over Polavaram Nallamala Sagar Reaches Supreme Court

అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు లింక్ చేయడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని ఆ పిటిషన్‌లో స్పష్టం చేసింది.

తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జలసంఘం, జల్ శక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది.

కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి సైతం సిద్ధపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, తక్షణమే ఈ చర్యలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఏపీ ప్రభుత్వం తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+