అసెంబ్లీకి క్రికెట్ ఫీవర్, ఇంటర్నెట్‌తో ఎమ్మెల్యేలు బీజీ
హైదరాబాద్: ఆస్ట్రేలియా, భారత ప్రపంచ కప్ ఫీవర్ తెలంగాణ శాసన సభకు కూడా తాకింది. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభ సాబీల్లో, ఆవరణ, మీడియా పాయింట్ వద్ద ఎవరిని కదిలించినా ఇదే చర్చ కనిపించింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, నేతల సెక్యూరిటీ సిబ్బంది, మీడియా.. ఇలా అందరు పోన్లో ఇంటర్నెట్ ద్వారా స్కోర్ తెలుసుకున్నారు. కొందరు ఇతరుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం సభ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్దకు వచ్చి కాసేపు మ్యాచ్‌ను వీక్షించారు. మీడియా ప్రతినిధులతో మ్యాచ్ పైన చర్చించారు.
కాగా, జీతాల పెంపు పైన బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మంత్రి హరీష్ రావుతో చర్చించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కాగా, అసెంబ్లీ వద్ద గురువారం నాటి కొన్ని పిక్చర్స్..

టీడీపీ
తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిలు తెలంగాణ శాసన సభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న దృశ్యం.

టీ అసెంబ్లీ
గురువారం తెలంగాణ శాసన సభ సమావేశాలు కొంత హాట్ హాట్‌గా సాగాయి. శాసన సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద..

టీడీపీ
తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, వివేక్‌లను తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అడ్డుకుంటున్న పోలీసుల దృశ్యం.

అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో తమను అడ్డుకున్న పోలీసులతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాగ్వాదం.

గవర్నర్‌కు మెమోరాండం
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో తమను అడ్డుకుంటోందని, తమను అనవసరంగా సస్పెండ్ చేశారని, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీడీపీ సభ్యులు గవర్నర్‌కు మెమోరాండం ఇచ్చారు.












Click it and Unblock the Notifications