ఘాతుకం: బాలికను లోబరుచుకుని గర్భవతిని చేశాడు
హైదారబాద్: తనవద్ద పనిచేయించుకునే పేరుతో ఓ పదమూడేళ్ల బాలికను లోబరుచుకుని ఓ నిమ్మకాయల వ్యాపారి ఆమెపై అత్యాచారం చేశాడు. నలభై ఏళ్ల ఆ నిమ్మకాయల వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - ఎన్టీఆర్‌నగర్‌లో నివసించే ఓ మహిళ గత కొన్నేళ్లుగా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి వివాహం చేసింది. చిన్నకుమార్తె (13) స్థానికంగా ఉండే కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఏసయ్య(40) అలియాస్ ఏషప్ప అనే ఓ వ్యాపారి వద్ద నిమ్మకాయలు ఏరే పనిని చేస్తోంది.

తన వద్ద పనిచేయించే పేరుతో ఆ బాలికపై సదరు వ్యక్తి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపుతానంటూ బాలికను బెదిరించాడు. సోమవారం ఆ బాలిక తన కడుపులో నొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో ఆమె అనుమానంతో విచారించారు.
విషయం తెలిసి మంగళవారం ఉదయం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితులకు పిల్లల హక్కుల కార్యకర్తలు బాసటగా నిలిచారు.












Click it and Unblock the Notifications