రైతులకు అండగా ఉందాం.!బీజేపి నేతలారా నడుంబిగించండి.!కమలదళానికి బండి బండి సంజయ్ పిలుపు.!

హైదరాబాద్ : వడగండ్ల వానతో రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి కోలుకోని విధంగా దెబ్బతిన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీజేపీ నేతలంతా రైతులకు అండగా నిలవాలని కోరారు. అందులో భాగంగా ఇరోజు మంగళవారం, రేపు బుదవారం జిల్లా నేతలంతా దెబ్బతిన్న పొలాల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఆ వివరాలతో నివేదిక రూపొందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఎల్లుండి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే స్పందనను బట్టి బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నామని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై వివరాలు సేకరించండి..
మంగళవారం బండి సంజయ్ కుమార్ పార్టీ జిల్లా అధ్యక్షుల, ఇంఛార్జీలు, కిసాన్ మోర్చా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి పాల్గొన్న ఈ టెలికాన్ఫరెన్స్ లో వడగండ్ల వానతో నష్టపోయిన రైతును ఆదుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు ఈనెల 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్, బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాలపై బండి సంజయ్ చర్చించారు.

 bandi

జిల్లా కలెక్టర్లకు పంట సాయంపై వినతి పత్రాలు ఇవ్వండి
వరుసగా కురుస్తున్న వడగండ్ల వానలతో రాష్ట్ర రైతాంగంపై కోలుకోని దెబ్బపడిందన్నారు బండి సంజయ్ కుమార్. చేతికొచ్చిన పంట చాలా చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయని, అసలే దోమకాటుతో ఈ ఏడాది రైతులు ఎకరానికి రూ.20 వేల అదనపు పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకుంటే వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నాశనమవ్వడంతో రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారన్నారు బండి సంజయ్ కుమార్. ఇగ కౌలు రైతుల బాధ వర్ణణాతీతంగా ఉందని, అప్పు తెచ్చి కౌలుకు తీసుకుంటే చేతికొచ్చిన పంట నష్టపోవడంతో అప్పులెలా తీర్చాలో, కౌలు పైసలు ఎట్లా కట్టాలో? కుటుంబాన్ని ఎట్లా నెట్టుకురావాలో అర్ధం కాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలు నెలకొన్నాయని బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు..
గత నెలలో కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టపోతే, ఎకరానికి రూ.10 వేలు సాయం చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇప్పటి వరకు నయా పైసా ఇయ్యలేదన్నారు. ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరిచి ఉంటే 30 నుండి 50 శాతం మంది రైతులు ఈరోజు పంట నష్టపోయే వాళ్లు కాదని, లేటుగా కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల విధిలేక పంట కోతలు లేటుగా ప్రారంభించడంతో వడగండ్ల వానకు మునిగిపోయాయని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

 bandi

జిల్లా అధ్యక్షులకు బండి సంజయ్ ఆదేశం..
ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతలంతా రైతులకు అండగా నిలవాలని, తక్షణమే పార్టీ శ్రేణులు మంగళవారం, బుదవారం పంట పొలాలను సందర్శించి పంట నష్టం వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్బంలో రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. ఎల్లుండి జిల్లా కలెక్టర్లకు పంట నష్టం, అందుకోసం చేయబోయే సాయంపై వినితి పత్రం అందజేయాలని కూడా సూచించారు. ప్రభుత్వం నుండి వచ్చే స్పందనను బట్టి ఆందోళన కార్యక్రమాలను రూపొందించుకోవాలన్నారు బండి సంజయ్ కుమార్.

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను సక్సెస్ చేయాలన్న బండి సంజయ్..
ఈనెల 30న ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు బండి సంజయ్ కుమార్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కేంద్రాలను ఏర్పాటు చేసి టీవీ, స్క్రీన్లు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమాలు వీక్షించేలా చూడాలన్నారు. అట్లాగే ఇప్పటి వరకు చేపట్టిన బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాల వివరాలను బుదవారం లోగా పంపించాలని బండి సంజయ్ కుమార్ జిల్లా నేతలను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+