శివాజీకి పెరుగుతున్న మద్దతు.. అనసూయను టార్గెట్ చేసిన ప్రియా చౌదరి
హీరోయిన్ల వస్త్రధారణ పైన దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో షాకింగ్ వ్యాఖ్యలు చేసిన శివాజీ పైన మొదట్లో మహిళా లోకం నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువగా మారాయి. అయితే ఈ వ్యవహారంలో చిన్మయి, అనసూయ శివాజీ పైన చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలలో కొత్త చర్చ మొదలైంది.
వస్త్ర ధారణపై శివాజీ వ్యాఖ్యలకు అనసూయ కౌంటర్
ముఖ్యంగా అనసూయ నా ఒళ్ళు నా ఇష్టం అంటూ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో స్విమ్ సూట్ లో పెడుతున్న వీడియోలు వెరసి మహిళలనుంచి శివాజీకి మద్దతు పెరిగి, అనసూయపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.బట్టలు వేసుకోవడం అనేది వ్యక్తిగత విషయమని, దానిగురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, ఆడవాళ్ళను బట్టలను బట్టి జడ్జి చేయకూడదని, మగవాళ్ళ దృష్టి మారాలని అనసూయ తనదైన శైలిలో శివాజీ ని టార్గెట్ చేసింది.

అనసూయ స్విమ్ సూట్ వీడియోను టార్గెట్ చేసిన ప్రియా చౌదరి
ఆపై సోషల్ మీడియాలో యదేచ్చగా ఒళ్లంతా కనిపించేలా స్విమ్ సూట్ వేసుకొని రీల్ షేర్ చేసింది. ఇక దీంతో మహిళలు తీవ్ర స్థాయిలో అనసూయ పైన మండిపడుతున్నారు. ఈ చర్చలోకి ఎంట్రీ ఇచ్చిన లైఫ్ కోచ్, ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియా చౌదరి అనసూయ తీరు పైన విరుచుకు పడుతున్నారు.శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన ఆమె అనసూయ, చిన్మయి వంటి వారి శివాజీ అనే టార్గెట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
అనసూయ సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరం
మీరు చేస్తే తప్పు లేదు కానీ అంటే తప్పు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. మహిళలు హుందాగా దుస్తులు ధరించాలని ఆమె వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం మహిళలను బట్టలు విప్పుకుని తిరగమనలేదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనసూయ స్విమ్ సూట్ ధరించిన ఫోటోలను, వీడియోలను ప్రస్తావించిన ప్రియా చౌదరి అటువంటి దుస్తులు ధరించేవారు సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
ఎక్స్పోజ్ చేస్తూ బయటకు వెళ్ళినాక మగవాళ్ళు మీద పడకూడదంటేఎలా?
రాజ్యాంగం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం కాదని, మన సమాజంలో ఉంటున్నాం అన్న విషయాన్ని మర్చిపోకూడదని ప్రియాచౌదరి పేర్కొన్నారు. ఒళ్లంతా కనిపించేలా ఎక్స్పోజింగ్ చేస్తూ, బయటకు వెళ్ళినాక మగవాళ్ళు మీద పడకూడదంటే ఎలాగో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. సమాజంలో మహిళల బట్టల తీరులో విచ్చలవిడితనం వచ్చిందని, భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని, సోషల్ మీడియాలో చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇదే పనిలో ఉన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సోషల్ మీడియాలో వైరల్ గా ప్రియా చౌదరి కామెంట్స్
శివాజీ అన్న మాటల్లో తప్పేముందో చెప్పాలని ప్రశ్నించారు. ఎందుకీ బరి తెగింపు అంటూ మండిపడ్డారు. మహిళలను సమాజంలో ధైర్యంగా, పురోగతి వైపు అడుగులు వేస్తూ ముందుకు నడవాలని చెప్పారు కానీ, ఇలా బట్టలు విప్పుకొని తిరగమని చెప్పలేదని, ఇది ఏ మాత్రం డెవలప్మెంట్ కాదని ఆమె బల్లగుద్ది మరీ చెప్పారు. ఇక శివాజీ వ్యాఖ్యలకు మద్దతుగా ప్రియా చౌదరి చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications