Dasara Bonanza: తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు చూస్తే మైండ్ బ్లాంక్..!
తెలంగాణలోనే అతిపెద్ద పండగ దసరా.. 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు.. బతుకమ్మ వేడుకలతో ఈ పండగను ప్రతి ఇంటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక పండగ సీజన్ లో తెలంగాణలో సాధారణంగా సుక్కా.. ముక్కా.. కామన్ అన్న సంగతి తెలిసిందే. అయితే మద్యం అమ్మకాల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2, 054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు స్పష్టం అవుతోంది.
గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మద్యం విక్రయాలు దాదాపు 37.02 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా అక్టోబర్ 19 న మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. ఆ ఒక్క రోజులోనే ఏకంగా రూ. 303 కోట్ల 40 లక్షల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ మేరకు ఈ సంఖ్య గత రికార్డులను అధిగమించినట్లు స్పష్టం అవుతోంది.
అక్టోబర్ 14 న రూ. 102 కోట్ల 17 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక అక్టోబర్ 15న మద్యం డిపోలకు సెలవు కావడంతో అమ్మకాలు నమోదు కాలేదు. అలాగే అక్టోబర్ 16న రూ. 126 కోట్ల 32 లక్షలు.. అక్టోబర్ 17న రూ. 223 కోట్ల 25 లక్షల విలువైన మద్యం అమ్మకం జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఇక అక్టోబర్ 18 న ఆదివారం సెలవు కావడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. అలాగే అక్టోబర్ 19 న అత్యధికంగా రూ. 303 కోట్ల 40 లక్షల విక్రయాలు జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ నాలుగు పని దినాల్లో మొత్తం రూ. 755 కోట్ల 14 లక్షల అమ్మకాలు నమోదైనట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ తో పోలిస్తే బీర్ల విక్రయాలు వేగంగా పెరిగినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ 1 నుంచి 19 వరకు 21.55 లక్షల కేసుల బీర్లు అమ్ముడు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 30. 37 లక్షల కేసులకు చేరింది. దీంతో బీర్ల అమ్మకాల్లో 41 శాతానికి పైగా వృద్ధి నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు గతేడాది 14.16 లక్షల కేసులుగా ఉండగా.. ఈసారి 18.38 లక్షల కేసులకు పెరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
