లిక్కర్ వ్యాపారుల కొత్త ట్రెండ్, కోట్ల ఆఫర్లు - లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్..!!
లిక్కర్ వ్యాపారం లో కొత్త ట్రెండ్ మొదలైది. నిబంధనలకు వ్యతిరేకమైనా వ్యాపారులు లెక్క చేయటం లేదు. లైసెన్సుల మాటున కొత్త దందా జరుగుతోంది. కొత్త దుకాణాలకు లైసెన్సులు జారీ అవుతున్న వేళ ఈ కొత్త వ్యాపారం బయటకు వస్తోంది. లాటరీ వచ్చి దుకాణం దక్కించుకున్న వారికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. భారీ అమ్మకాలు సాగే ప్రాంతాల్లో వీరికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో, ఈ వ్యవహారం ఇప్పుడు లిక్కర్ వ్యాపారుల్లో సంచలనంగా మారుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుత మద్యం దుకాణాల రెండేళ్ల గడువు నవంబరు 30తో ముగియనుంది. డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. కొత్త దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ శాఖ.. ఇటీవల లాటరీ పద్ధతిలో కేటాయింపులు కూడా చేసింది. కాగా, ఈ సారి దరఖాస్తు చేసిన వారిలో .. షాపులు దక్కించుకున్న వారిలో లైసెన్స్ మరొకరికిచ్చి సొమ్ము చేసుకుందామనుకునే వారు ఎక్కువయ్యా రు.

రూ.80లక్షల నుంచి రూ.1.50 కోట్లకు మరొకరికి లైసెన్సు ఇచ్చేస్తున్నారు. రూ.కోట్లు చెల్లించి లైసెన్స్ తీసుకుంటున్నా రెండేళ్లలో అంతకు ఐదింతలు కచ్చితంగా సంపాదించుకోవచ్చని అసలైన వ్యాపారులూ కాసులు కుమ్మరించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సారి టెండర్లు దాఖలు చేసిన వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.. అందునా మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కో దుకాణాన్ని రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల చొప్పున వందల సంఖ్యలో లైసెన్స్‌లను అద్దెకు ఇచ్చేసినట్లు తెలుస్తోంది.. జిల్లాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ ఒక్కో దుకాణం అమ్మకం స్థాయి బట్టి రూ.80వేల నుంచి రూ.కోటికి అమ్మేస్తున్నారు. వేరేవాళ్లకు అద్దెకు ఇచ్చినందుకు అందులో వచ్చే లాభంలో సగం వాటాతో పాటు అదనంగా తక్షణమే లక్షలు గుడ్‌విల్‌గా ఇస్తున్నారు.
రూ రూ.3లక్షలు పెట్టి దరఖాస్తు చేసుకోగా లాటరీలో దుకాణం వచ్చిన వారిలో కొందరు రూ.1.10 కోట్లకు పాత సిండికేట్‌కు ఆ లైసెన్సును అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు జిల్లాల్లో లైసెన్సులు వారి పేరు మీదనే కొనసాగిస్తూ అద్దెకు ఇవ్వటం.. ఎక్కువ రేటుకు రెండేళ్ల పాటు రాసివ్వటం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. లైసెన్సు మంజూరు సమయంలోనే నిబంధనలను స్పష్టం చేస్తారు. అయినా, లోపాయి కారీగా ఈ తరహా వ్యాపారాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications