వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో లాక్‌డౌన్ జిల్లాలు75: ఏపీ, తెలంగాణలో ఇవే, తెరిచి ఉండేవి, బంద్ చేసేవి ఏవంటే..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న 75 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఢిల్లీలో వైద్యారోగ్య శాఖ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రాల మధ్య ప్రయాణ సర్వీసులు కూడా రద్దు చేయాలని, అత్యవసర రవాణా సేవలు మాత్రమే నడపాలని అన్ని రాష్ట్రాలుకు సూచించినట్లు తెలిపారు. ప్యాసెంజర్ రైళ్లు కూడా మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లు కూడా నిలిపివేయాలని రాష్ట్రాలకు సూచించామని వివరించారు.

 List of 75 districts under lockdown, only essential services to be open

మనదేశంలో కరోనా బాధితుల్లో లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తున్నాయని లవ్ అగర్వాత్ తెలిపారు. కొంత మంది బాధితుల్లో 7 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ అని తెలుస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులు సామాజిక దూరం పాటించడం మంచిదని సూచించారు. మనదేశంలో వారానికి 10 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగలుగుతున్నామని చెప్పారు. జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు.

లాక్ డౌన్ ప్రకటించిన దేశంలోని 75 జిల్లాలను పరిశీలించిట్లయితే..

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి
ఆంధ్రప్రదేశ్: ప్రకాశం, విజయవాడ, విశాఖపట్నం
రాజస్థాన్ రాష్ట్రంలోని బిల్వారా, ఝుంఝును, సికర్, జైపూర్
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, ఇరోడ్, కాంచీపురం
ఉత్తరప్రదేశ్: ఆగ్రా, జీబీ నగర్, ఘజియాబాద్, వారణాసి, లఖింపూరి, లక్నో
ఉత్తరాఖండ్: డెహ్రాడూన్
పశ్చిమబెంగాల్: కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు
కర్ణాటక: బెంగళూరు, చిక్కబల్లపుర, మైసూర్, కొడుగు, కలబురిగి
కేరళ: అలప్పుజ, ఎర్నాకులం, ఇడుక్కి, కన్నూరు, కసార్గూడ, కొట్టాయం, మల్లాపురం, పఠానంతిట్ట, తిరువనంతపురం, త్రిసూర్
లడఖ్: కార్గిల్, లేహ్
మధ్యప్రదేశ్: జబల్పూర్
మహారాష్ట్ర: అహ్మద్ నగర్, ఔరంగాబాద్, ముంబై, నాగపూర్, ముంబై సబర్బన్, పుణె, రత్నగిరి, రాయ్‌గడ్, థానే, యావత్మల్
ఒడిశా: ఖుర్దా
పుదుచ్చేరి: మహె
పంజాబ్: హోషియాపూర్, సాస్ నగర్, ఎస్బీఎస్ నగర్
ఛండీఘర్: ఛండీఘర్
ఛత్తీస్ గఢ్: రాయ్ పూర్
ఢిల్లీ: సెంట్రల్, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, నార్థ్ ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ
గుజరాత్: కచ్, రాజ్‌కోట్, గాంధీనగర్, సూరత్, వడోదర, అహ్మదాబాద్
హర్యానా: ఫరీదాబాద్, సోనేపట్, పంచకుల, పానిపట్, గుర్గావ్
హిమచల్ ప్రదేశ్: కొంగ్రా
జమ్మూకాశ్మీర్: శ్రీనగర్, జమ్మూ

బంద్ ఉండేవి: అన్ని అంతర్రాష్టీయ బస్సు సర్వీసులు, ప్యాసెంజర్ రైళ్లు, మెట్రో సర్వీసులు.

తెరిచి ఉండేవి:
నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయల దుకాణాలు
పాల విక్రయ కేంద్రాలు
కుకింగ్ గ్యాస్ పంపిణీ
టెలీకాం సర్వీసులు
ఫుడ్ హోం-డెలివరీ
ఈ -కామర్స్
బ్యాంకులు, ఏటీఎంలు
ఆస్పత్రులు, మందుల దుకాణాలు
పరిమిత ప్రజా రవాణా.
అత్యవసర సేవలు మినహా అన్నింటినీ ఈ జిల్లాల్లో బంద్ చేయనున్నారు.

English summary
The Centre and state governments have decided to completely shutdown75 districts across the country where coronavirus cases have been reported, officials said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X