వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 4 రోజులు కేటీఆర్ రెస్ట్ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఒక పక్క రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఇలాంటి సమయాన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు రోజులపాటు రెస్టు తీసుకోనున్నారు. ఇంట్లో కూర్చొని తనకు నచ్చిన సినిమాలను ఆరామ్ సే వీక్షించనున్నారు.

<strong>విజయశాంతి సంచలనం ..రెవెన్యూ శాఖ ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోటరహస్యం త్వరలోనే ఆవిష్కృతం </strong>విజయశాంతి సంచలనం ..రెవెన్యూ శాఖ ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోటరహస్యం త్వరలోనే ఆవిష్కృతం

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒంటి చేత్తో .. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రెస్ట్

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒంటి చేత్తో .. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలను ఒంటి చేత్తో వ్యూహాత్మకంగా నిర్వహించి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంటిపట్టునే నాలుగు రోజులనుండి రెస్టు తీసుకోనున్నారు. ఎప్పుడు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయడం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండే కేటీఆర్ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా రెస్ట్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ఆయనకు తప్పని పరిస్థితి.

కళ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్ ..ఎన్నోచూసే అవకాశం కలిగిందని చమత్కారం

కళ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్ ..ఎన్నోచూసే అవకాశం కలిగిందని చమత్కారం

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు కళ్లకలకతో బాధపడుతున్నారు. దాంతో కొన్ని రోజులు తాను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.సోఫాలో కూర్చున్నట్టుగా ఉన్న తన ఫొటోను ట్వీట్‌లో అటాచ్‌ చేస్తూ.. కళ్లకలకతో ఎన్నోచూసే అవకాశం కలిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ ద్వారా రెస్ట్ తీసుకోనున్నానని ప్రకటించిన కేటీఆర్

ట్విట్టర్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పంచుకునే కేటీఆర్ తన కళ్లకలక వచ్చి, ఐ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న విషయాన్ని సైతం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక దీని వల్లే తాను నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే ఆయన ఎక్కడ ఉన్నా పార్టీ విషయంలో, ఎన్నికల వ్యవహారంలో ఆయన బ్రెయిన్ అంతే పాదరసంలా పనిచేస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వరుస ఎన్నికలతో, చాలా బిజీ షెడ్యూల్ తో అలసిపోయిన కేటీఆర్ కు ఈ రకంగానైనా రెస్ట్ దొరికిందని పార్టీ నేతలు అనుకుంటున్నారు.

English summary
The state is in the political heat peaks. Whether the Lok Sabha elections are over TRS party working president KTR is going to take rest for four days. He is suffering from viral conjunctivitis . The doctors said he would have to rest for a three to four days. He was informed by Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X