'జూన్4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం : సీఈవో వికాస్ రాజ్
రాష్ట్రంలో జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు.
ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుందని సీఈవో వికాస్ రాజ్ వివరించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండవని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు, బారికేడ్లు, పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు సీఈవో వికాస్ రాజ్.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2.17 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు ఉంటుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
#WATCH | Hyderabad, Telangana: On arrangements for the counting day of Lok Sabha elections, Chief Electoral Officer Telangana, Vikas Raj says, "We have 17 parliament constituencies...We also have one bye-election...We have put counting centres in 34 locations...Inside the… pic.twitter.com/8D3pLg1vLC
— ANI (@ANI) June 1, 2024
సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామని చెప్పారు. లెక్కింపు రోజు(జూన్ 4) ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామని సీఈవో తెలిపారు. 2400కు పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని సీఈవో వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారన్నారని సీఈవో తెలిపారు. కాగా, శనివారం తుది దశ పోలింగ్ ముగిస్తుండటంతో.. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సిద్దమైంది.












Click it and Unblock the Notifications