విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి! కత్తితో ఛాతిపై, కడుపులో పొడిచి..
A Love Maniac attacked on a girl, Bonakallu Mandal Centre of Khammam District, Love Maniac attacked girl with knife,
ఖమ్మం: ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది దాడిచేసి కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బోనకల్లు మండల కేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో కోలా వెంకటేశ్వర్లు కుమారుడు రామలింగయ్య ఇదే గ్రామానికి చెందిన మన్నెం అంజయ్య కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
చదవండి: మహిళకు లైంగిక వేధింపులు, కాల్‌గర్ల్ అంటూ మార్ఫింగ్ చేసిన నగ్న ఫొటోలు.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో...
దీంతో సదరు విద్యార్థిని తన తల్లిదండ్రుల సహాయంతో గత ఏడాది డిసెంబర్‌లో రామలింగయ్య వేధింపులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. బెయిల్‌పై తిరిగొచ్చిన రామలింగయ్య మళ్లీ ఆ విద్యార్థినిని బెదిరించసాగాడు.

ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు మిర్యాలగూడెం పక్కనే ఉన్న యాదగిరిపల్లిలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి ఆ విద్యార్థినిని పంపించారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నందున కొన్ని రోజుల క్రితం ఆమె తిరిగి బోనకల్లులోని తమ ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన రామలింగయ్య ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటికి వెళ్లాడు.
తనతోపాటు తీసుకెళ్లిన కత్తితో ఆ విద్యార్థిని ఛాతిపై, కడుపులో పొడిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో పరిసర ప్రాంతాల వారు తలుపులు పగలగొట్టి చూస్తున్న క్రమంలో రామలింగయ్య అక్కడ్నించి పరారయ్యాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థినిని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. బోనకల్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications