మహిళకు లైంగిక వేధింపులు, కాల్‌గర్ల్ అంటూ మార్ఫింగ్ చేసిన నగ్న ఫొటోలు.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో...
ముంబై: ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న ఓ యువకుడు మార్ఫింగ్ చేసిన ఆమె నగ్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఆమెను కాల్‌గర్ల్‌గా పేర్కొన్నాడు. అంతేకాదు, ఆమె మొబైల్ నంబర్ కూడా ఇవ్వడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి వెకిలిగా మాట్లాడుతూ వేధిస్తున్నారు.
చదవండి: 'నిన్నూ.. నీ కూతుర్ని రేప్ చేస్తా..': టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెసేజ్
మొదట్లో ఆమె చూసీ చూడనట్లు వదిలేసిందికానీ వేధింపులు అధికం కావడంతో భరించలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం... ముంబైలోని బాంద్రాకు చెందిన మహిళ(26) ముంబైలోని ఓ ప్రముఖ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తోంది. గత నెలలో ఆమె సహ ఉద్యోగి ఒకరు ఆమెతో మాట్లాడుతూ తనకు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని, ప్రొఫైల్ వేరేగా ఉన్నా ఫొటోలు మాత్రం నీలాగే ఉన్నాయని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది.
సదరు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మార్ఫింగ్ చేయబడిన ఆమె ఫొటోలు ఉండటమేకాక... ఆమెను సెక్స్ వర్కర్‌గా పేర్కొంటూ ఓ మొబైల్ నంబర్ కూడా ఉంది. అయితే ఆ నంబర్ మాత్రం ఆమెది కాదని పోలీసులు ధ్రువీకరించారు. తొలుత ఈ విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు.
ఆ తరువాత వాట్సాప్ గ్రూప్‌లో కూడా అభ్యంతరకరమైన రీతిలో ఆమె ఫొటోలు వరుసబెట్టి పోస్ట్ చేస్తుండడంతో ఆ మహిళ సదరు వాట్సాప్ గ్రూప్ నుంచి బయటికొచ్చేసింది. దీంతో నిందితుడు నేరుగా ఆమెకు ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించాడు.
తాను పోలీసులకు భయపడనని, తననెవరూ పట్టుకోలేరని ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో ఫిబ్రవరి 14న మళ్లీ అదే వాట్సాప్ గ్రూప్‌లో ఆమె పేరును కూడా జోడించిన నిందితుడు తిరిగి మార్ఫింగ్ చేసిన ఫొటోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు.
అంతేకాదు, మూడు వేర్వేరు నంబర్లతో ఆమెకు ఫోన్లు చేస్తూ ఆమెను బెదిరించాడు. నడిరోడ్డుపై అత్యాచారం చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోలను అతడు షేర్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications