‘నిన్నూ.. నీ కూతుర్ని రేప్ చేస్తా..’: టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెసేజ్
గుర్గావ్ : విద్యాబుద్ధులు నేర్పే గురువును గౌరవించాల్సిందిపోయి కొందరు విద్యార్థులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీస సభ్యతను మరిచిపోతున్నారు. అవారాలుగా మారి తిక్క చేష్టలకు పాల్పడుతున్నారు. క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఓ టీచర్‌ను ఫేస్‌బుక్ ద్వారా ఓ 13 ఏళ్ల విద్యార్థి బెదిరించాడు.
చదవండి: ఛీ.. వీడు గురువేనా?: అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లతో ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తూ...
టీచర్‌ను, ఆమె మైనర్ కూతురుని రేప్ చేస్తానంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరించాడు. ఈ సంఘటన గుర్గావ్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే, ఆ స్కూల్లో ఇదే తొలి సంఘటన కాదు. అంతకు వారం రోజుల ముందు కూడా కొంతమంది విద్యార్థులు తమతో రైడింగ్‌కు వస్తారా? క్యాండిల్ లైట్ డిన్నర్‌కు వస్తారా? అంటూ కూడా మెయిల్స్ పంపించారు.

తాజాగా ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి పంపిన ఫేస్‌బుక్ పోస్ట్ చూసి టీచర్ సహా కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ రోజు నుంచి ఆమె స్కూల్‌కు వెళ్లడమే మానేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం కూడా ఈ అంశాలపై సీరియస్‌గా స్పందించడం మొదలుపెట్టింది.
జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విద్యార్థులకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి నోటీసులు పంపించనున్నట్లు స్పష్టం చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications