ఛీ.. వీడు గురువేనా?: అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లతో ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తూ...
బాల్కొండ: ఓ ఉపాధ్యాయుడు తనతోటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలతోపాటు, ఫొటోలు పంపిస్తున్నాడు. అతడి చర్యలతో విసిగిపోయిన ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు.
చదవండి: 'నిన్నూ.. నీ కూతుర్ని రేప్ చేస్తా..': టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెసేజ్
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఉన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తోన్న ఉపాధ్యాయురాలితో అదే పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు శాంతికుమార్ కొన్ని నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

ఉపాధ్యాయురాలి సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలతోపాటు, ఫొటోలు పంపిస్తున్నాడు. దీంతో ఆమె తన భర్తకు, ఇతర కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వివరించింది. వారు సదరు ఉపాధ్యాయుడిపై ఇటు పోలీసులకు, అటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయుడు శాంతికుమార్ గతంలో ధర్మారం బీ పాఠశాలలో కూడా ఇలాగే వ్యవరించాడని, దీంతో అక్కడ అతడికి దేహశుద్ధి కూడా చేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. మరోవైపు ఈ లైంగిక వేధింపుల ఘటనపై ఎంఈవో బి.రాజేశ్వర్ కూడా పాఠశాలలో విచారణ జరిపారు.












Click it and Unblock the Notifications