పారిపోయి వచ్చి.. యాదగిరిగుట్ట లాడ్జీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
నల్గొండ: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించిన నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ ప్రేమజంట. ఈ ఘటన నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది.
పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి ఓడీఏఫ్ కాలనీకి చెందిన శ్రీమన్నారాయణ (21), శ్రీవాణి (19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరివి వేర్వేరు కులాలు. దీంతో వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో 15 రోజుల క్రితం ఇళ్లను వదిలొచ్చారు.
చేతుల్లో డబ్బులు లేకపోవడం, కుటుంబసభ్యులు వెతుకుతున్నారనే భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం యాదగిరిగుట్టకు చేరుకొని ఓ లాడ్జీలో బస చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

నొప్పి భరించలేక 108కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications