ఆ ఒక్క సంఘటన... కేసీఆర్ కు అధికారాన్ని దూరం చేసింది?

గత ఎన్నికల సందర్భంగా రాజశ్యామల యాగాన్ని నిర్వహించి మంచి ఫలితాలు సాధించారు కేసీఆర్. ఈసారి అదే యాగాన్ని తన సొంత ఫామ్ హౌస్ లో నిర్వహించారు. మూడురోజులపాటు జరిగిన యాగంలో కేసీఆర్ పాల్గొంటూనే సభలకు కూడా హాజరయ్యారు. ఆయన నమ్మకానికి అనుగుణంగా మహాగని మొక్కను అడవి నుంచి తీసుకొచ్చి కొత్త సచివాలయం ప్రాంగణంలో నాటారు. ప్రతిరోజు దాని సంరక్షణ కోసం అటవీ, ఉద్యానవన శాఖల అధికారులు చొరవ తీసుకున్నారు. మొక్క ఏపుగా పెరిగేందుకు అవసరమైన ఆర్గానిక్ ఎరువులతో పాటు పురుగు పుట్టకుండా మందుల్ని సైతం ఉపయోగించారు.

మహాగని మొక్కకు ఔషధ విలువల సంగతి ఎలా ఉన్నా ఆధ్యాత్మికంగా మంచి జరుగుతుందని కేసీఆర్ భావించారు. దీన్ని సచివాలయంలో నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మొక్క మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేల స్వభావమో, మరే ఇతర కారణమో తెలియదుకానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బతకలేదు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలోనే ఆ మొక్క జీవించే అవకాశం లేదని తేలిపోయింది.

mahagani plant in the secretariat is dried

ఇదంతా అపశకునమేననే అభిప్రాయం వ్యక్తం అయింది. దాని ప్రభావం పోలింగ్ రోజు కనిపించిందంటున్నారు. మొక్క ఎండిపోవడంవల్ల భారత రాష్ట్ర సమితికి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదంటున్నారు. వీటికి బలం చేకూర్చేలా ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. యాగంద్వారాకానీ, మొక్క నాటడంద్వారా కానీ అనుకున్న ఫలితాలు రాలేదనే స్పష్టత వచ్చిందంటున్నారు.

అయితే మరికొందరు మాత్రం మరో సంఘటనను ఉదాహరణగా చూపిస్తున్నారు. పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మించారు. అయితే ఆ సమయంలో సచివాలయంలో ఉండే అమ్మవారి దేవాలయాన్ని పడగొట్టారని, దాన్ని మళ్లీ నిర్మించలేదని, ఈ ఒక్క సంఘటనే కేసీఆర్ ఓడిపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+