రోజా ఎఫెక్ట్, 'జగన్' షాక్: మహేష్ బాబు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల అసహనం?
స్పైడర్ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు దేశం తమ్ముళ్లకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది.
హైదరాబాద్: స్పైడర్ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు దేశం తమ్ముళ్లకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది.
చదవండి: శ్రీరామ్ పెళ్లికి ఒక్కొక్కరిని పిలవాలని ఉన్నా, అర్థం చేసుకోని రండి: పరిటాల సునీత

వైసిపికి అభిమానుల మద్దతు తర్వాత
వరుస సంఘటనలు తెలుగు తమ్ముళ్లను ఆవేదనకు గురి చేస్తున్నాయని అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహేష్ బాబు అభిమాన సంఘాలు వైసిపికి మద్దతు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు.. జగన్, వైయస్‌ను పొగడటం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు
మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా అభిమానులు వైసిపి మద్దతివ్వడం, ఆయాచితంగా అడిగిన ప్రశ్నకు జగన్, వైయస్ గురించి చెప్పడం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదని అంటున్నారు.

ప్రమోషన్‌లో భాగంగా
స్పైడర్ మూవీ విడుదల నేపథ్యంలో పలు చానళ్లలో మహేష్ బాబు ప్రమోషన్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సాక్షిలోను ఆయన ఇంటర్వ్యూ వచ్చింది. గతంలో ఖైదీ నెంబర్ 150 సినిమాకు రోజా.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు మహేష్ బాబును కూడా ఇంటర్వ్యూ చేశారు.

అసహనానికి రోజా కారణం
ఓ విధంగా మహేష్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల అసహనానికి రోజా కారణమని అంటున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా రోజా వైయస్ రాజశేఖర రెడ్డి గురించి అడిగారు. ఈ సమయంలో ఆయన వైయస్, జగన్‌లను మెచ్చుకున్నారు.

ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఏం చెప్పారంటే..
గతంలో తాను వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశానని, ఆ సమయంలో జగన్ కూడా ఉన్నారని, వైయస్ మంచి లీడర్ అని, ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే వారని మహేష్ బాబు చెప్పారు.

వీటి పైనే గుర్రు
అంతేకాదు, వైసిపి అధినేత వైయస్ జగన్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని మహేష్ బాబు అన్నారు. నవ్యాంధ్రకు అతను లీడర్ అని కూడా అన్నారు. జగన్ అంటే తన తండ్రికి అభిమానం అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు అసహనంతో ఉన్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications