వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీరామ్ పెళ్లికి ఒక్కొక్కరిని పిలవాలని ఉన్నా, అర్థం చేసుకోని రండి: పరిటాల సునీత

అక్టోబర్ 1వ తేదీన మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరగనుంది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆలం తనయ జ్ఞానవితో పెళ్లి కానుంది.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అక్టోబర్ 1వ తేదీన మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరగనుంది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆలం తనయ జ్ఞానవితో పెళ్లి కానుంది.

అందరికీ సునీత ఆహ్వానం ఇలా..

అందరికీ సునీత ఆహ్వానం ఇలా..

ఈ నేపథ్యంలో పరిటాల సునీత అభిమానులకు, టిడిపి కార్యకర్తలకు బహిరంగంగా పెళ్లికి ఆహ్వానం పంపించారు. ఒకటో తేదీన జరగనున్న పెళ్లికి అందరు హాజరు కావాలని ఆమె అందులో విజ్ఞప్తి చేశారు.

పరిటాల అభిమానులుగా మీరు నన్ను నడిపించారు

పరిటాల అభిమానులుగా మీరు నన్ను నడిపించారు

'మీ అన్న పరిటాల రవీంద్ర గారు మనకి దూరమయ్యారు.. అయితే ఆయన అందించిన ధైర్యం అభిమానులుగా మీ అండదండలు నేను ఒంటరిని అన్న విషయాన్ని మరిచాను... ఏనాడు బయట ప్రపంచం తెలియని నాకు పరిటాల అభిమానులుగా మీరే నన్ను నడిపించారు.' అని సునీత పేర్కొన్నారు.

మీ రుణం తీర్చుకోలేను, మన ఇంట మొదటి శుభకార్యం

మీ రుణం తీర్చుకోలేను, మన ఇంట మొదటి శుభకార్యం

ఎంత చేసినా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని పరిటాల సునీత పేర్కొన్నారు. నేడు మన ఇంట మొదటి శుభకార్యం జరుగుతోందని, నా పెద్ద కొడుకు పరిటాల శ్రీరామ్ పెళ్లి వెంకటాపురంలో అక్టోబర్ 1న జరగనుందని అందులో పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరిని పిలవలేకున్నాననే బాధ

ప్రతి ఒక్కరిని పిలవలేకున్నాననే బాధ

ఈ వివాహానికి ప్రతి ఒక్కరిని పేరుపేరునా పిలవాలన్న కోరిక తనకు ఉందని, కానీ పిలువలేకపోతున్నాననే బాధ నాలో ఉందని సునీత పేర్కొన్ననారు. నాకున్న బాధ్యతల దృష్ట్యా నన్ను అర్థం చేసుకొని మీ ఇంట కార్యంగా భావించి శ్రీరామ్ వివాహానికి అందరు విచ్చేసి దీవెనలు అందించి నవదంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని సునీత పేర్కొన్నారు.

English summary
Telugu Desam Party leader and Minister Paritala Sunitha invited all the paritala fans and TDP followers to Paritala Sriram marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X