Hyderabad to Kollam: హైదరాబాద్-కొల్లం ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

తెలంగాణలోని హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు మీదుగా కేరళలోని కొల్లంకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ రైల్వే ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఈ వర్షా కాలంలో కేరళ అందాల్ని చూసేందుకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా ప్రయాణికులకు వెళ్తుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ రైల్వే ఏకంగా 13 ప్రత్యేక రైళ్లను (Hyderabad to Kollam Trains) అందుబాటులోకి తెస్తోంది. అలాగే వీటికి సంబంధించిన వివరాలను కూడా విడుదల చేసింది.

ప్రతీ శనివారం హైదరాబాద్ నుంచి కొల్లంకు ప్రత్యేక రైలు 07193 ప్రస్తుతం నడుపుతున్నారు. దీన్ని సెప్టెంబర్ 26 వరకూ పొడిగిస్తూ దక్షిణ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో 13 అదనపు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే కొల్లం నుంచి హైదరాబాద్ కు ప్రతీ సోమవారం ప్రత్యేక రైలు నంబర్ 07194ను కూడా సెప్టెంబర్ 28 వరకూ పొడిగించారు. ఇలా మరో 13 రైళ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. అలాగే వీటికి టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

Hyderabad to Kollam Trains Extended Southern Railway Adds 13 Trips Each Way Advance Booking Soon

హైదరాబాద్ లో శనివారం రాత్రి 11.10కి బయలుదేరే కొల్లం ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం ఉదయం 7.10కి కొల్లం స్టేషన్ కు చేరుకుంటుంది. అలాగే కొల్లంలో సోమవారం ఉదయం 10.45కు బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం 5.30కు హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ స్లీపర్, ధర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతిలో స్టాప్ లు ఉన్నాయి. మొత్తం 36 స్టాప్ లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+