Viral video: ఛీ.. ఛీ.. ఇదేం పని.. హైదరాబాద్ మెట్రోలో..
హైదరాబాద్ మెట్రోలో నిత్యం వేల మంది ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఎక్కువ సమయం పడుతున్న కారణంగా ఆఫీస్ లకు, కాలేజీలకు వెళ్లే వారు మెట్రోనే ఆశ్రయిస్తుంటారు. అలాగే ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లేవారు కూడా మెట్రోలోనే ప్రయాణం చేస్తుంటారు. ఇక మెట్రో స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. మెట్రో రైలులో సాధారణంగా ఉదయం ఆఫీస్ టైమింగ్స్ అలాగే సాయంత్రం వేళల్లో ఎక్కువ రద్దీగా ఉంటుంది. రైలులో సీట్ సంగతి పక్కన పెడితే కనీసం నిల్చోవడానికి కూడా ప్లేస్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు.
అయితే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో తాజాగా ఓ షాకింగ్ ఘటన జరిగింది. మెట్రో రైలులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించేటప్పుడు కనీస బాధ్యత, క్రమశిక్షణ పాటించాలని, తోటి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ మెట్రో రైలులో ఏం జరిగింది..?

వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. ఓ వ్యక్తి మెట్రో రైలు ఎక్కాడు. అయితే అతను ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా అసౌకర్యంగా కూర్చొన్నాడు. అది చూసిన తోటి ప్రయాణికులు అలా కూర్చొవద్దని సరిగ్గా కూర్చోవాలని సూచించారు. కానీ వారి మాటలను అతడు వినలేదు. అంతేకాక చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తాను కేవలం కూర్చొన్నానని.. తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని వారించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
A video of a man putting his bare feet up on the seat in the Hyderabad Metro and not budging even after other passengers confront him has sparked a fresh debate on civic sense. pic.twitter.com/VfvME4FgQ7
— The Siasat Daily (@TheSiasatDaily) June 2, 2026
ఈ వీడియోను అపరాజిత్ అనే ఎక్స్ యూజర్ తన ఖాతాలో పోస్టు చేశాడు. ఈ మేరకు పోస్టు ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications