అన్ని పార్టీల ఎంపీలకు కర్తవ్య బోధ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు మరియు మౌలిక వసతుల అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వీటిపై ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల ఎంపీలతో నిర్వహించిన కీలక సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి సాగుదాం అన్న సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్ లో జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లురవి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్యాదవ్, రామసహాయం రఘురామిరెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య తదితరులతో నిర్వహించిన సమావేశంలో కీలకవ్యాఖ్యలు చేశారు.

cm revanth reddy special request to all party MPs to focus on state develpoment irrigation projects

హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్రానికి విన్నపం

నీటిపారుదల ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి అనుమతులు నిధులు సాధించడం పైన ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలవాల,ని మూసీ నదిపునరుజ్జీవనం ఫేస్ వన్ పనులకు అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద అనుమతులు పొందాలని సూచించారు.

ప్రధానంగా ఇరిగేషన్, వ్మానాశ్రయాలు, బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లపై చర్యలు

అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో ఫేజ్ 2 విస్తరణపైన, ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనుల పైన అందరూ వేగంగా పని చేయాలన్నారు. వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి, బుల్లెట్ రైలు ప్రాజెక్టులపైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తుంగభద్ర, గోదావరి నీటిపంపకాలు, గోదావరి కావేరి అనుసంధానం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపైన, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలతో జరిగిన చర్చల వివరాలను ఎంపీలకు తెలియజేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గౌరవం.. ఆ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గౌరవం.. ఆ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానం

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై అందరూ ఒక్కటిగా స్పందించాలి

రాష్ట్ర ప్రయోజనాలను రక్షించిన కేంద్ర మంత్రులు, ప్రధాని వద్ద విజ్ఞప్తులు చేయాలని ఆయన మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించాలని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మిల్లింగ్ సామర్థ్యం, స్టోరేజ్ సమస్యలు, స్టాండింగ్ కమిటీల ద్వారా పెండింగ్ అంశాలు పరిష్కరించడం వంటి సూచనలు చేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+