తిరుపతికి వెళ్లే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో మార్పులు - రూట్, కొత్త టైమింగ్స్..!!

రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతికి వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచారు. పలు ప్రాంతాల మీదుగా తిరుపతికి రైళ్లు నడుపుతున్నారు. గతంలో వీక్లీ నడిచే రైళ్లల్లోనూ కొన్నింటికి రెగ్యులర్ చేసారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త రైళ్లు ప్రకటిస్తున్న సమయంలో తిరుపతికి వెళ్లే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు చేసారు. కొత్త టైమింగ్స్ ప్రకటించారు. అమలు ముహూర్తం పైనా క్లారిటీ ఇచ్చారు.

తిరుపతికి వెళ్లే భక్తుల రద్దీకి అనుగుణంగా రైళ్ల నిర్వహణ పైన అధికారులు ఫోకస్ చేసారు. పలు ప్రాంతాల నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక స్టేషన్ల నుంచి ఈ రైళ్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్‌ బైవీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం. 12761) బయలుదేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సవరించారు. ప్రస్తుతం ప్రతీ బుధ, శనివారాల్లో తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి 8:05 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు, అక్టోబరు 10 నుంచి రాత్రి 7:50 గంటలకు బయలుదేరుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమయంతో పోలిస్తే 15 నిమి షాల ముందుగా ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ మార్పుకు అనుగుణంగా ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

విశాఖ- బెంగళూరు వందేభారత్ స్లీపర్ సిద్దం: రూట్, హాల్టింగ్ స్టేషన్లు, షెడ్యూల్..!!
విశాఖ- బెంగళూరు వందేభారత్ స్లీపర్ సిద్దం: రూట్, హాల్టింగ్ స్టేషన్లు, షెడ్యూల్..!!
railways-latest-announcement-over-timings-revised-for-karimnagar-tirupati-super-fast-express-detai

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో

కాగా, ఈ రైలు గూడూరు, విజయవాడ, వరంగల్‌, పెద్దపల్లి మార్గం మీదుగా కరీంనగర్‌కు చేరే ఈ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరే సమయ మార్పునకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 10 తరువాత ఈ రైలుకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకునే వారు మారిన సమయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ తుది కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా విశాఖ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ షెడ్యూల్ సైతం ఖరారు చేసారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి మరో వందేభారత్ స్లీపర్ ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. త్వరలోనే ఈ రైలు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+