మళ్లీ రోడ్డు పైకి జగన్, సీమ కేంద్రంగా - కీలక నిర్ణయం..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ లు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే కూటమి- వైసీపీ మధ్య రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వైసీపీని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని వైసీపీ తమ ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఈ సమయంలో నే మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్ ఈ మధ్య కాలంలో విమర్శల జోరు పెంచారు. పరామర్శ యాత్రలు కొనసాగిస్తున్నారు. ఈ యాత్రల సమయంలో వస్తున్న స్పందన తో జనం జగన్ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. అటు కూటమి నేతలు జగన్ యాత్ర సమయంలో చోటు చేసుకుంటున్న ఘటనల ను ప్రశ్నిస్తున్నారు. రైతుల సమస్యలు.. పార్టీ నేతలకు మద్దతుగా జగన్ జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో భీమవరం, దేవరపల్లి లో జగన్ పర్యటనలకు వచ్చిన స్పందనతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. కాగా.. ఇప్పుడు జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాయలసీమ కేంద్రం గా జగన్ మరో పర్యటనకు సిద్దమయ్యారు.

కేబినెట్ లో బీజేపీకి మరో బెర్తు, ఆయనకే ఛాన్స్ - నాగబాబు ఎంట్రీ ఇక..!?
కేబినెట్ లో బీజేపీకి మరో బెర్తు, ఆయనకే ఛాన్స్ - నాగబాబు ఎంట్రీ ఇక..!?
ys-jagan-to-visit-kurnool-on-august-13-to-console-arrested-mla-virupakshi-here-the-details

కర్నూలు జిల్లా పర్యటనకు జగన్

ఈ నెల 13న కర్నూలు జిల్లా పర్యటనకు జగన్ సిద్దం అయ్యారు. ఆలూరు పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శ కోసం జగన్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇప్పటికే విరూపాక్షి అరెస్ట్ పైన జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. జరిగిన ఘటన వివరిస్తూనే... అరెస్ట్ తీరు పైన మండిపడ్డారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉందా అంటూ నిలదీసారు. ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోందని అన్నారు.. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో.. విరూపాక్షి పరామర్శ కోసం కర్నూలు వెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. దీంతో.. జగన్ పర్యటన కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+