సీఎం విజయ్ కు బిగ్ షాక్..! భారీ ప్లాన్ కాస్తా అట్టర్ ప్లాప్..!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay)కు ఏదీ కలిసి రావడం లేదు. తాజాగా త్రిష వ్యవహారంలో విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేసి, తిరిగి కోర్టులో ఆయన్ను విచారించి వదిలేస్తామని చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) విషయంలో రాష్ట్ర ఎంపీల్ని ఏకం చేసి తమిళనాడు ప్రతినిధిగా కేంద్రం దగ్గర మార్కులు కొట్టేద్దామని విజయ్ వేసిన భారీ ప్లాన్ కాస్తా అట్టర్ ప్లాప్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ - మహిళా బిల్లు సహా పలు కీలక బిల్లుల్ని ఆమోదింపచేసుకునేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ విపక్షాలు మాత్రం అమిత్ షాను సభకు వచ్చి విద్యార్దులపై పోలీసులు చేసిన దాడులపై సమాధానం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. అదే సమయంలో డీలిమిటేషన్ బిల్లుతో పాటు ఇతర బిల్లుల్ని కలిపి ఇదే సమావేశాల్లో ఆమోదింపచేసుకుందామని అనుకుంటే, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్న ఎంపీలు, ఇతర బిల్లులకు మద్దతివ్వడం లేదు. దీంతో డీలిమిటేషన్-మహిళా బిల్లుల్ని పక్కనబెట్టి మిగతా బిల్లులు ఆమోదింపచేసుకుంటున్న కేంద్రం.. వాటి కోసం ఈ నెల 16-18 తేదీల మధ్య ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్దమవుతోంది.

ఇంత కీలకమైన డీలిమిటేషన్ బిల్లుకు విపక్షాల మద్దతు కీలకంగా మారింది. ఇప్పటికే తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాల్ని సొమ్ము చేసుకుంటూ డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకోవాలని కేంద్రం చూస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు తమిళనాడు పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు, తద్వారా కేంద్రం వద్ద తన సత్తా చాటుకునేందుకు విజయ్ భారీ ప్లాన్ చేశారు. తమిళనాడు ఎంపీల్ని పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించేలా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానాలు పంపారు. ఇలా తమిళనాడులో లోక్ సభ, రాజ్యసభ కలిపి మొత్తం 57 మంది ఎంపీలు ఉండగా.. వీరిలో కేవలం 20 మంది మాత్రమే వస్తామని చెప్పారు. మిగతా వాళ్లు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. డీలిమిటేషన్ ను వారు కూడా వ్యతిరేకిస్తున్నా.. విజయ్ కు క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేక వారు దూరంగా ఉండబోతున్నారు. దీంతో విజయ్ ప్లాన్ కాస్తా ప్లాప్ అవుతోంది.




Click it and Unblock the Notifications