వైజాగ్ స్పెషల్ "మాడుగుల హల్వా" .. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి..!

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్స్ లో హల్వా ఒకటి. అయితే ఈ హల్వాలోను అనేక రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ స్వీట్ ను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే విశాఖపట్నం స్పెషల్ మాడుగుల హల్వా టేస్ట్ మామూలుగా ఉండదు. ఈ హల్వా ఆ ప్రాంతంలో చాలా స్పెషల్. ఈ హల్వాను ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా ఈజీ. చాలా మందికి తెలియక బయట కొనుగోలు చేసి తింటుంటారు. మరి సూపర్ టేస్టీ మాడుగుల హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఈ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

మాడుగుల హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే గోధుమలు 400 గ్రాములు, పంచదార 700 గ్రాములు, నెయ్యి 300 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా గోధుమలను శుభ్రంగా కడిగి 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా రుబ్బి, పల్చటి గుడ్డ సాయంతో గోధుమ పాలను వేరు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మందపాటి గిన్నెలో పంచదార వేసి మునిగేంత నీరు పోసి లేత పాకం వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.

MadugulaHalwa Vizag special make it easily at home What are the required ingredients details here

అలా పాకం వచ్చిన తర్వాత తీసిపెట్టిన గోధుమ పాలను కొద్దికొద్దిగా పాకంలో పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై కలుపుతూ కొద్దికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. మిశ్రమం చిక్కబడి అంచుల వెంట నెయ్యి బయటకు వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత హల్వా గట్టిపడి రుచికరంగా తయారవుతుంది. అంతే సూపర్ టేస్టీ మాడుగుల హల్వా రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+