పేర్ని నాని.. ఈ పాపం ఊరికే పోదు.. అనుభవిస్తావ్: పవన్ అభిమాని నిరంజన్ తండ్రి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్, ఆయనను కలిసిన కొద్దిరోజులకే అకస్మాత్తుగా మరణించడం తెలిసిందే. అయితే తాజాగా నిరంజన్ మరణం వెనుక కారణాలను మీడియాతో పంచుకున్న తల్లిదండ్రులు పేర్ని నానిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని కారణంగానే నిరంజన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారని అకస్మాత్తుగా మృతిచెందడం వెనుక పేర్ని నాని చేసిన బాధించేవ్యాఖ్యలు ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో పేర్ని నానిని టార్గెట్ చేశారు.

నిరంజన్ మృతిపై తండ్రి వ్యాఖ్యలు

ఇప్పుడు నిరంజన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.పవన్ కళ్యాణ్ నిరంజన్ ను పలకరించడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన నిరంజన్ గత కొన్ని నెలలుగా కండరాలకు సంబంధించి అరుదైన వ్యాధితో బాధపడుతూ మంచం పట్టాడు.

pawan kalyan fan niranjan death issue Father Blames Perni Nani Remarks for Niranjan Death

పవన్ ను వాడు వీడు అంటూ పేర్ని నాని దుర్భాషలు

పవన్ కళ్యాణ్ ను చూడాలన్న ఆశను వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ నిరంజన్ ను చూడ్డానికి నేరుగా హనుమకొండకు వెళ్ళాడు. నిరంజన్ తో మాట్లాడి, నిరంజన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. నిరంజన్ కోరికలు తెలుసుకుని అవి తీర్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన పేర్ని నాని వాడు వీడు అంటూ దుర్భాషలాడుతూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

పేర్ని నాని వల్ల తీవ్ర మనస్తాపంలో నిరంజన్

పేర్ని నాని నిరంజన్ ను కలిసిన సమయంలో పవన్ కళ్యాణ్ పైన చేసిన తీవ్ర వ్యాఖ్యలు నిరంజన్ మనసుకు ఎంతో బాధను కలిగించాయని ఆ వీడియోను చూసిన నిరంజన్ తీవ్ర మనస్థాపానికి గురై బాధపడ్డాడు అని తండ్రి పేర్కొన్నారు. పదే పదే అదే వీడియో చూసే వాడని అన్నారు. అకస్మాత్తుగా నిరంజన్ హఠాన్మరణం చెందడం వెనుక, అస్వస్థతకు గురవడం వెనుక పేర్ని నాని ఉన్నారన్నారు.

ఈ పాపం వూరికే వదులుతుందా?

ఈ పాపం ఆయనను ఊరికినే వదిలిపెట్టని వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి ఆరోగ్యాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం పైన ఆవేదన వ్యక్తం చేశారు. నిరంజన్ ను బాధ పెట్టిన వారికి ఆ పాపం తప్పకుండా చుట్టుకుంటుందని పేర్ని నాని పైన ఘాటుగా స్పందించారు నిరంజన్ తండ్రి. దేవుడు అన్ని చూస్తున్నాడని చేసిన పనులకు ఫలితం అనుభవించాల్సిందే నని ఆయన పేర్కొన్నారు.

అదిరిపోయే వార్త: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలకగుర్తింపు
అదిరిపోయే వార్త: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలకగుర్తింపు

"పవన్‌ను దుర్భాషలాడిన పేర్ని నాని వ్యాఖ్యలే మా కుమారుడి మరణానికి కారణం." అంటూ నిరంజన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణంగా మరాయి. మరి తాజా ఆరోపణల పైన పేర్ని నాని ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+