నెల రోజుల గరిష్ఠానికి క్రూడ్- పెట్రోల్ బాంబు మళ్లీ పేలుతుందా?

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణల నేపథ్యంలో క్రూడాయిల్ ధర నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ తాజా పరిణామాలు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను మళ్లీ నష్టాలపాలు చేస్తోన్నాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

అంతర్జాతీయ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కరోజులో తొమ్మిది శాతానికి పైగా పెరిగింది. బ్యారెల్‌కు 85 డాలర్ల మార్కును దాటిపోయింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముడి చమురు ధర కూడా 79 డాలర్ల పై చిలుకుకు పలుకుతోంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇరాన్ నౌకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కఠిన దిగ్బంధాన్ని విధించడమే ఈ అకస్మాత్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

Oil Soars to 4-Week High as Trump Reimposes Iran Blockade as Tensions Spread Across the Gulf region

అమెరికా సైనిక బలగాలు ఇరాన్‌పై వరుసగా మూడో రోజు కూడా వైమానిక దాడులను కొనసాగించాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌకపైనా అమెరికా ఏకంగా 20 శాతం టోల్ ఫీజును డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ జలాల్లో తమ సైన్యం అందిస్తున్న భద్రతా సేవల నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ నుంచి కూడా ఈ మొత్తాన్ని వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సంక్షోభ సమయంలో పర్షియన్ గల్ఫ్ దేశాలు తమ ఎగుమతులను నిరంతరాయంగా కొనసాగించడానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తోన్నాయి. సరఫరా అంతరాయాలు కలగకుండా ఉండేందుకు యూఏఈ వంటి దేశాలు తమ చమురు ఉత్పత్తిని భారీగా పెంచాయి. జూన్ లో యూఏఈ తన రోజువారీ ముడి చమురు ఉత్పత్తిని గతం కంటే 1.71 మిలియన్ బ్యారెళ్లు పెంచింది. మొత్తం 3.8 మిలియన్ బ్యారెళ్లకు చేర్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరగడం వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో క్రూడ్ ధర 100 డాలర్లను అధిగమించినప్పుడు ప్రభుత్వం ఇంధన పన్నులను తగ్గించింది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్లను పలుమార్లు పెంచింది. ఈసారి కూడా గల్ఫ్ సంక్షోభం భారతీయ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+