ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్‌ ఏర్పాటు..

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఫోన్​ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌ పై మరో సిట్ ఏర్పాటు అయింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ లో కీలకంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్‌ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సిట్‌ లో సభ్యులుగా రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, DGANB డీఎస్పీ శ్రీధర్..

Major Breakthrough in Phone Tapping Case New SIT Formed Under CP Sajjanar

అలాగే హైదరాబాద్‌ మెట్రోలో పనిచేస్తున్న డీఎస్పీ నాగేందర్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్​ ఎదుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్​ అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+