మల్లారెడ్డి.. ఇంటర్ ఎక్కడ చదువుకున్నట్టు? అఫిడవిట్ లో షాకింగ్ అంశాలివే!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. గతంలో పాలమ్మినా, పూలమ్మినా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా, తాజాగా ఎన్నికల సమయంలో ఆయన మరో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ అందుకు కారణంగా మారింది.
మల్లారెడ్డి తాను అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు, గతంలో రెండు ఎన్నికలలో పేర్కొన్న అంశాలతో ఏ విధంగానూ మ్యాచ్ కాకపోవడంతో ప్రస్తుతం ఆయన అఫిడవిట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని ఆరోపణలు వెల్లువగా మారాయి.

2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ప్యాట్నీ లోని ప్రభుత్వ కాలేజీలో 1973సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివినట్టు పేర్కొన్నారు. ఇక 2018 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం 2023 మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు.
ఇప్పుడు ఈ మూడు అఫిడవిట్ లపై రాంపల్లి దాయార గ్రామవాసి అయిన కందాడి అంజిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన మూడుసార్లు ఎన్నికలలో మూడు కాలేజీల పేర్లు ప్రస్తావించడాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇంతే కాదు వయసు విషయంలో కూడా మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన అంశాలు తప్పుగా ఉన్నాయన్నారు.
2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి వయసు 56 సంవత్సరాలని ఇచ్చారని, ఇప్పుడు వయసు 70 సంవత్సరాలు అని ఇచ్చారని, 2014 నుండి 2023 వరకు 9 సంవత్సరాలే అవుతుందని, అలాంటప్పుడు మంత్రి మల్లారెడ్డి వయసు 70 సంవత్సరాలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇక ఆస్తుల వివరాల్లో కూడా మంత్రి మల్లారెడ్డి అన్ని తప్పులే ఇచ్చారని ఆయన నామినేషన్ను తిరస్కరించడానికి ఈ ఆధారాలు చాలని పేర్కొన్నారు. మరి వ్యవహారంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications