ఓరుగల్లు వాసులకు తీపికబురు.. మామునూర్ ఎయిర్పోర్ట్ కు త్వరలో టెండర్లు

తెలంగాణ రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న ఓరుగల్లులో మామునూరు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కార్య రూపం దాలుస్తోంది. చారిత్రక నగరమైన ఓరుగల్లు అన్ని రంగాలలోనూ పురోగమించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు జరగబోతుంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత రాష్ట్రంలోని రెండో అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది.

స్పీడందుకున్న మామునూరు ఎయిర్ పోర్ట్ పునః ప్రారంభ ప్రక్రియ

ఓరుగల్లు వాసుల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్పోర్ట్ పునః ప్రారంభ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం ఒప్పందం ప్రకారం ఎయిర్ పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయం నిర్మించకూడదు అన్న నిబంధన ఉండేది. ఈ సాంకేతిక నిబంధన కారణంగానే మామునూరు ఎయిర్పోర్ట్ ఫైల్ దశాబ్దాలుగా మూలన పడింది.

mamnoor airport tenders for the construction of Mamunoor Airport within two to three weeks

మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం పైన కీలక ప్రకటన వెల్లడయింది. రాబోయే 2028 జూన్ రెండవ తేదీ నాటికి మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రారంభించుకుంటామని అధికారికంగా ప్రకటించడం మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న కమిట్మెంట్ కు అర్థం గా మారింది.

రెండు మూడు వారాల్లో టెండర్లు పిలిచే చాన్స్

ఈ మేరకు రాబోయే రెండు మూడు వారాల్లో టెండర్లు పిలవడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి విమానాశ్రయ అభివృద్ధికి 950 ఎకరాల భూమి అవసరం ఉండగా గతంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో 697 ఎకరాల భూమి ఉంది. ఎయిర్పోర్ట్ అవసరాలకు కావలసిన మిగతా భూమిని సేకరించడం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి యుద్ధ ప్రాతిపదికన గుంటూరు పల్లి, నక్కపల్లి, గాడి పల్లి, మామునూరు పరిసర గ్రామాలలో 253 ఎకరాల భూసేకరణ చేసింది.

ఎయిర్పోర్ట్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్

రైతులను ఒప్పించి, భూములను తీసుకొని వారికి నష్టపరిహారం చెల్లించింది. విమానాశ్రయానికి సంబంధించిన రన్వే విస్తరణ విమానాల పార్కింగ్ బే లు, టెర్మినల్ బిల్డింగ్, కార్ పార్కింగ్ పైలెట్లు సిబ్బంది నివాసాల కొరకు నిర్మాణాలు, ఎయిరో సిటీ నిర్మాణం కోసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే తెలంగాణ యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది. అన్ని రంగాలలోనూ ప్రగతి సాధించడానికి వీలుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+