భార్యతో అక్రమ సంబంధం: చెప్పినా వినకపోవడంతో ప్రియుడ్ని నరికి చంపిన భర్త
వరంగల్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు ఆమె భర్త. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేటలో నివాసముంటున్న బొంతురాజు.. టవేరా వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, రాజు భార్య సరిత ఇంటి పక్కన నివాసముంటున్న ఉప్పుల నగేష్(28)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయం తెలిసన రాజు పలుమార్లు ఇద్దరిని హెచ్చరించాడు. తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అతని మాటలు పెడచెవిన పెట్టడంతో నగేష్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో రాజు తన తమ్ముడితో కలిసి బుధవారం రాత్రి నగేష్ ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న అతని కళ్లలో కారం చల్లారు. ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications