హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏప్రిల్ ఫూల్ చేయబోయి బుక్కయ్యాడు -తెలంగాణలో లాక్‌డౌన్‌ అంటూ ఫేక్ జీవో -ఏపీ వ్యక్తికి పోలీసుల షాక్

|
Google Oneindia TeluguNews

ఎందుకు, ఏలా మొదలైందనే వాస్తవ వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు(ఏప్రిల్ 1) ఏప్రిల్ ఫూల్స్ డే నిర్వహిస్తుండటం, ఆరోజు స్నేహితులు, కుటుంబ సభ్యులను వివిధ రకాలుగా ఫూల్స్ చేసి ఆనందిస్తుండటం అందరికీ అలవాటైపోయింది. ప్రముఖ మీడియా సంస్థలు కొన్ని ఆరోజు అసత్య కథనాలను ప్రచురించడం చూస్తుంటాం. చంద్రబాబు తన టీడీపీని బీజేపీలో విలీనం చేయబోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన 'ఫూల్స్ డే' కథనం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. 'తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్' అనే మరో ఫేక్ న్యూస్ కూడా విపరీతంగా వైరలైంది. పత్రిక కథనాన్ని పక్కనపెడితే, ఓ వ్యక్తి చేసిన ఫేక్ జీవోలపై పోలీసులు సీరియస్ యాక్షన్ కు దిగారు..

రాఫెల్ కుంభకోణం: షాకింగ్ ట్విస్ట్ -భారతీయ మధ్యవర్తికి భారీగా లంచం -దసాల్ట్ రికార్డుల్లో పట్టివేతరాఫెల్ కుంభకోణం: షాకింగ్ ట్విస్ట్ -భారతీయ మధ్యవర్తికి భారీగా లంచం -దసాల్ట్ రికార్డుల్లో పట్టివేత

ఫేక్ జీవో కలకలం..

ఫేక్ జీవో కలకలం..

దేశమంతటా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దరిమిలా తెలంగాణ‌లోనూ మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం మ‌రోసారి లాక్‌డౌన్‌ విధించిందంటూ నాలుగు రోజులు క్రితం ఒక నకిలీ జీవో సోషియల్ మీడియాలో వైరలైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్ డౌన్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం, లాక్ డౌన్ సంబంధిత జీవోలేవీ గడిచిన 4రోజుల్లో జారీకాకపోవడంతో జనం గందరగోళానికి గురయ్యారు. దీంతో సదరు జీవో నకిలీదని, లాక్ డౌన్ వదంతుల్ని నమ్మొద్దని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు..

దొరికిపోయిన ఫేక్ రాయుడు

దొరికిపోయిన ఫేక్ రాయుడు

తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ విధించారంటూ ఫేక్ జీవో కాపీని సర్క్యులేట్ చేసిన వ్యక్తి కోసం హైదరాబాద్ పోలీసులు గాలించారు. టెక్నికల్ టీమ్ తో కలిసి ఆ మెసేజ్ మూలాల్లోకి వెళ్లగా.. లాక్‌డౌన్‌ ఫేక్ జీవోను సృష్టించిన వ్యక్తి దొరికిపోయాడు. ఆ ఫేక్ రాయుణ్ని సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుడు శ్రీపతి సంజయ్ కుమార్(48) ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందినవాడని, హైదరాబాద్ లోని ప్రఖ్యాత కార్వీ సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు.

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుతల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

ఫ్రెండ్స్‌ను ఫూల్స్ చేయబోయి..

ఫ్రెండ్స్‌ను ఫూల్స్ చేయబోయి..

నిందితుడు సంజయ్ నుంచి ఓ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని, లాక్‌డౌన్‌పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకొని, తేదీలు మార్చి.. పాత జీవోను సంజయ్, అతని స్నేహితులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారలను ప్రజలు నమ్మవద్దని, వాట్సాప్‌ గ్రూపుల్లో అడ్మిన్స్‌గా ఉన్నవాళ్లు నిజనిర్ధారణ చేసుకున్న తర్వాతనే సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేయాలని, లేదంటే వారిపైనా కేసులు పెడతామని సీపీ హెచ్చరించారు.

కాగా, ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా తన స్నేహితులను ఆటపట్టించేందుకే లాక్ డౌన్ జీవోను రూపొందించానని, అది ఇలా వైరల్ అయి, అరెస్టు వరకు దారి తీస్తుందని ఊహించలేకపోయానని నిందితుడు సంజయ్ వాపోయాడు.

English summary
A Chartered Accountant, who allegedly forged and circulated a Government Order on COVID-19 lockdown in the State, which created panic, was arrested by the Hyderabad police here on Monday. The accused, Sreepathi Sanjeev Kumar (48), who worked at Karvy and Co., and a resident of Madhapur, downloaded and forged the government document in his laptop and phone on April 1, which he further circulated in the WhatsApp groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X