అక్రమ సంబంధమనే అనుమానం: భార్య మెడ కోసి, అతనిపై గొడ్డలితో దాడి
హైదరాబాద్: భార్యపై అనుమానంతో భర్త తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. ఆమె మెడకోసి అనుమానితుడిపై గొడ్డలితో దాడిచేశాడు. ఇద్దరూ చనిపోయారనుకుని అక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్ పాతబస్తీలోని పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్ గ్రామానికి ఏర్పుల దానయ్యకు రాములమ్మతో వివాహమైంది. అదే గ్రామానికి చెందిన చికెన్ సెంటర్ నిర్వాహకుడు పోలమోని అశోక్‌తో రాములమ్మకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు అశోక్ చికెన్ సెంటర్ వద్దకు దానయ్య వెళ్లి అతడితో గొడవపడ్డాడు. ఆగ్రహానికి లోనైన దానయ్య అశోక్ ఎడమచేతిపై గొడ్డలితో దాడిచేశాడు.

ఇద్దరి పెనుగులాటలో గొడ్డలి కిందపడిపోగానే అక్కడే ఉన్న మాంసం కోసే కత్తితో అశోక్ కాళ్లపై దానయ్య పొడిచాడు. ఆ తర్వాత తూకం రాయితో దాడిచేయడంతో అశోక్ కణితికి దెబ్బ తగలడంతో తీవ్రమైన గాయమైంది. అక్కడి నుంచి ఆవేశంగా ఇంటికెళ్లిన దానయ్య మాంసం కోసే కత్తితో భార్య మెడ కోశాడు. రాములమ్మ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి రావడంతో పారిపోయి పోలీసులు లొగింపోయాడు.
సమాచారం అందుకున్న హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ మన్మథకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గొడ్డలి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రాములమ్మను ఉస్మానియా, అశోక్‌ను సన్‌రైజ్ ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
విచారణ నిమిత్తం దానయ్యను పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ నుంచి హయత్‌నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అశోక్ భార్య ఆండాళ్ ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications