రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి: మృతుడు గుంటూరువాసి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా వలిగొండ- నాగారం స్టేషన్ల మధ్య నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడిని గుంటూరుకు చెందిన పాతికేళ్ల సాంబయ్యగా గుర్తించారు.
ఈ సంఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వేపోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున జరిగింది. గుంటూరుకు చెందిన సాంబ సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు తన మిత్రుడితో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరాడు.

ప్రయాణం సమయంలో మిత్రులిద్దరు మాట్లాడుకుంటూ రైలు మెట్ల మీద కూర్చుకున్నారు. అయితే, రైలు వలిగొండ సమీపానికి వచ్చేసరికి ఇద్దరు కూడా రైల్లోంచి జారిపడ్డారు. దీంతో సాంబయ్య అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన మిత్రుడిని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications