ప్రియురాలి భర్తను హత్య చేసి వివాహేతర సంబంధం, ఏడాదిన్నర తర్వాతిలా....

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె భర్తను హత్య చేశాడు ప్రియుడు.ఈ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత ఈ విషయం వెలుగు చూసింది.

దుండిగల్:ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆమె భర్తను హత్య చేశాడు ప్రియుడు. ఈ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత ఈ హత్య విషయం వెలుగు చూసింది.నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హైద్రాబాద్ బేగంపేట ప్రాంతానికి చెందిన రవీందర్ , పద్మ 2012 లో పెళ్ళి చేసుకొన్నారు. వీరిది ప్రేమ వివాహం.రవీందర్ దొంగతనాలు చేసేవాడు. వీరికి ఇద్దరు సంతానం.అయితే దొంగతనాలకు అలవాటు పడిన రవీందర్ ఓ కేసులో జైలుకెళ్ళాడు.

దీంతో పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళింది.బహదూర్ పల్లిలోని గృహ సముదాయం వద్ద ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది.అదే ప్రాంతానికి యశోవర్థన్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

man murdered for illegal affair

జైలు నుండి వచ్చిన రవీందర్ కు తన భార్య పద్మకు యశోవర్థన్ తో వివాహేతర సంబంధం విషయం తెలిసింది.దీంతో యశోవర్థన్ ను చంపుతానని బెదిరించాడు.దీంతో యశోవర్థన్ ఆమెకు దూరంగా ఉన్నాడు.

పద్మ కు కూడ రవీందర్ ఇదే విషయం చెప్పాడు. అయితే రవీందర్ తనను హత్య చేస్తాడని యశోవర్థన్ భయపడ్డాడు.రవీందర్ తనను చంపడానికి ముందే తానే అతణ్ణి చంపాలని భావించాడు.

తన స్నేహితుడు నాగరాజుతో కలిసి రవీందర్ ను బహదూర్ పల్లి సాయినాథ్ సోసైటీకి అనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో 2015 సెప్టెంబర్ లో హత్య చేశాడు.ఆ రోజు నుండి రవీందర్ ఆచూకీ లేకుండా పోయింది.అయితే దొంగతనం కేసులో అరెస్టు అయి ఉండవచ్చిన అందరూ అనుమానించారు.

ఓ దొంగతనం కేసులో బేగంపేట పోలీసులు అతని కోసం గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో అతనితోపాటు పద్మ సెల్ ఫోన్ పై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అయితే పద్మకు కూడ భర్త చనిపోయిన విషయం తెలియదు. మళ్ళీ జైలుకు వెళ్ళి ఉంటాడని భావించిన పద్మ యశోవర్థన్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది.

దీంతో పోలీసులు యశోవర్థన్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. రవీందర్ ను తానే హత్య చేశానని తెలిపారు. అతణ్ణి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించారు. ఈ నెల 17వ, తేదిన రవీందర్ మృతదేహనికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+