లిఫ్ట్‌లో ఆమెను అసభ్యంగా తాకాడు: అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో యువతికి లైంగిక వేధింపులు
హైదరాబాద్: యువతులపై లైంగిక వేధింపుల ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. తాజాగా అమీర్‌పేట మెట్రో ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో ఓ యువతి (22) లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంది. వేధింపులపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌కు చెందిన యువతి రసూల్‌పురా వెళ్లేందుకు జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌లో రైలెక్కింది. సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే అమీర్‌పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో రైలు మారాల్సి ఉండటంతో.. ఆ స్టేషన్‌లో దిగింది.

స్టేషన్‌లోని రెండో అంతస్తులో ఉన్న ప్లాట్ ఫామ్ పైకి వెళ్లడం కోసం లిఫ్ట్ ఎక్కింది. మెట్రో స్టేషన్‌లో టికెటింగ్, క్యాష్ మేనేజ్‌మెంట్ ఉద్యోగిగా పని చేస్తున్న ట్రిగ్ డిటెక్టివ్ సర్వీసెస్‌కు చెందిన నితిన్‌రెడ్డి(25) కూడా యువతితో పాటే లిఫ్ట్‌లో ఎక్కాడు.
లిఫ్టులో ఇద్దరే ఉండటంతో యువతిని అసభ్యంగా తాకాడు. పదేపదే అలా తాకి నితిన్ రెడ్డి ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications