విజయ్ సినిమా ఎఫెక్ట్: టి-బిజెపి నేతపై మంచు విష్ణు ఆగ్రహం, మోడీ అంటే గౌరవం
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహా రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ నర్సింహ రావు మాట్లాడారు.
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహా రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ నర్సింహ రావు మాట్లాడారు.
చదవండి: విశాల్ ఇంటిపై జీఎస్టీ అధికారుల దాడులు, విజయ్ సినిమాపై స్పందించిన తెల్లారే

బిజెపి నేత తీవ్ర విమర్శలు
విజయ్ నటించిన మెర్సెల్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో సినీ తారలపై విమర్శలు చేశారు. భారత సినీ నటుల్లో ఎక్కువ మందికి బుర్ర లేదని, వారికి జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువ అన్నారు.

మంచు విష్ణు ఘాటు స్పందన
పై వ్యాఖ్యలపై మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. సినీ తారలకు జీకే ఉండదనుకుంటే అప్పుడు రాజకీయ నాయకులంతా అవినీతిపరులు, దోపిడీదారులా? అని ప్రశ్నించారు. మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యారన్న విషయం మరువద్దన్నారు.

దానికి జీకే అవసరం లేదు
అలాంటివారిలో స్వర్గీయ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఉన్నారని మంచు విష్ణు గుర్తు చేశారు. ఒకరి అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదన్నారు. తాను భారతీయుడినని, క్రైస్తవ యువతిని వివాహం చేసుకున్నప్పటికీ హిందుత్వాన్ని నమ్ముతానని తెలిపారు.

ప్రధాని మోడీ అంటే గౌరవం
చివరిగా తాను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతానని మంచు విష్ణు చెప్పారు. అదే సమయంలో బీజేపీపై తనకు గౌరవముందని, ప్రధాని నరేంద్ర మోడీ అంటే అభిమానం ఉందన్నారు.

జీవీఎల్ నర్సింహా రావుపై బాలీవుడ్ నటుడి ఆగ్రహం
కాగా, జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీకెంత ధైర్యమంటూ మండిపడ్డారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications