విశాల్ ఇంటిపై జీఎస్టీ అధికారుల దాడులు, విజయ్ సినిమాపై స్పందించిన తెల్లారే

Posted By:
Subscribe to Oneindia Telugu
  హీరో ఇంటిపై GSTఅధికారుల దాడులు, మెర్సల్‌ ఎఫెక్ట్ | Oneindia Telugu

  చెన్నై: హీరో విశాల్ నివాసం, కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఏకకాలంటో జరిగిన ఈ దాడులు కొనసాగుతున్నాయి. తమిళనాట దుమారం రేపుతున్న విజయ్ సినిమా మెర్సల్‌కు విశాల్ మద్దతు ప్రకటించారు.

  బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిపై కూడా విమర్శలు చేశారు. సినిమాలో జీఎస్టీ గురించి ఉన్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న తరుణంలో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

  తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మెర్సల్ సినిమాకు మద్దతు ప్రకటించినప్పటికీ విశాల్ ఇంటిపై మాత్రమే దాడులు జరుగుతున్నాయి.

  మధ్యాహ్నం సోదాలు ప్రారంభం

  మధ్యాహ్నం సోదాలు ప్రారంభం

  చెన్నైలోని వడపళనిలో గల కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి. విశాల్‌ నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ లక్షల్లో పన్ను చెల్లించకుండా ఎగవేసినట్లు సమాచారం రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు. జీఎస్టీఐకి చెందిన నలుగురు సీనియర్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

  సేవాపన్ను చెల్లించలేదనే సమాచారంతో

  సేవాపన్ను చెల్లించలేదనే సమాచారంతో

  విశాల్‌ నిర్మాణ సంస్థ గత ఏడాది నుంచి సేవా పన్ను చెల్లించలేదని తమకు సమాచారం వచ్చిందని, అందుకే సోదాలు నిర్వహిస్తున్నామని, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సోదాలు చేపట్టామని జీఎస్టీఐ అధికారి ఒకరు తెలిపారు.

  విశాల్ సేవా పన్ను చెల్లించాడని

  విశాల్ సేవా పన్ను చెల్లించాడని

  ఇదిలా ఉండగా విశాల్‌ సేవా పన్ను చెల్లింపు చేసినట్లు సంబంధిత అధికార పత్రాలన్నింటినీ చూపించారని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. జిఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు విశాల్ వెల్లడించారు.

  ఆ తెల్లవారే దాడులు

  ఆ తెల్లవారే దాడులు

  2013లో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీని విశాల్‌ ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ సంస్థ కింద ఇప్పటి వరకు ఆరు సినిమాలు నిర్మించారు. ఈ సంస్థ నుంచి వచ్చిన పలు చిత్రాల్లో విశాల్‌ ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం విశాల్‌ తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా, విజయ్‌ నటించిన మెర్సల్‌ చిత్రం పైరసీ చూస్తున్న బిజెపి నేత హెచ్‌ రాజాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A team of the Intelligence Agency of the GST conducted raids at the office of the Vishal Film Factory, the production house owned by actor and President of Tamil Nadu Film Producers Council Vishal.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి