‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి..
బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి సత్తా ఏమిటో మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం నిరూపించింది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీయడంలో స్పెషలిస్ట్ అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ఈ చిత్రం, 109 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. సంక్రాంతి పండగ కావడంతో కుటుంబ ప్రేక్షకులంతా ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు తరలివచ్చారు.
రూ.305 కోట్లు రాబట్టింది
మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించడం, విక్టరీ వెంకటేష్ ఒక పవర్ ఫుల్ స్పెషల్ రోల్‌లో మెరవడంతో సినిమాపై అంచనాలు పెరగడం, వాటిని అందుకోవడం జరిగింది. మొదటి రోజే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల వసూళ్లను రాబట్టింది. సీనియర్ హీరోల చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఇది కొత్త రికార్డును సృష్టించింది. ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూల్లు భారీగా వచ్చాయి.

మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన వరప్రసాద్ గారు 57 రోజుల రన్ పూర్తి చేసుకునే సమయానికి బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ.304 నుంచి రూ.305 కోట్లు వసూలు చేసింది. ఇందులో మనదేశం నుంచి వచ్చినవి రూ.220 కోట్లు కాగా, విదేశాల నుంచి వచ్చినవి రూ.43 కోట్. ఈ చిత్రానికి దాదాపు రూ.180 కోట్లకు పైగా షేర్ వచ్చింది.
వ్యూస్ పరంగా సంచలనాలు
రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి బయ్యర్లకు, నిర్మాతలకు రూ.70 కోట్ల నికర లాభాలు సంపాదించిపెట్టింది. థియేటర్లలో సందడి ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం 'జీ 5' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా వ్యూస్ పరంగా సంచలనాలు సాధిస్తోంది. మెగాస్టార్ ఈ సినిమా తర్వాత విశ్వంభరను విడుదల చేయబోతున్నారు. అనంతరం బాబీ దర్శకత్వంలో నటించబోతున్న చిత్రంలో నటిస్తారు. ఇది మాఫియా నేపథ్యంలో నడిచే కథ అని, చిరు మాఫియా డాన్ పాత్ర చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
-
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications