నోరు జారాను, సారీ: త్రిషకు క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు

ప్రముఖ నటి త్రిష కృష్ణన్ పై నటుడు- దర్శకుడు ఆర్ పార్థిబన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఓ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొన్నియిన్ సెల్వన్ లోని కుందవై పాత్ర గురించి వ్యాఖ్యాతలు అడిగినప్పుడు ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ తో కలిసి ఓ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరుకావడంపై పార్థిబన్ బహిరంగంగా త్రిషను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. ఈ కుందవైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి. అదే మంచిది. వారిని బయటకు పంపించకూడదని వ్యాఖ్యానించారు.

పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ విషయంలో డివైడ్ టాక్ వినిపించింది. కొందరు ఆయనకు మద్దతుగా నిలవగా, మరికొందరు గట్టిగా వ్యతిరేకించారు. పార్థిబన్ కూడా 2004లోనే విడాకులు తీసుకున్నారని గుర్తు చేశారు. అయినప్పటికీ- మాజీ భార్యతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇంకొందరు పేర్కొన్నారు.

Parthiban Tamil Actor apologizes after Trisha bold Instagram statement about insults over Comments

ఈ వీడియో క్లిప్ పై తొలుత త్రిష స్పందించారు. పార్థిబన్ పేరు ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తన ఎక్స్ లో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన పేరు, తాను నటించిన ఓ సినిమా గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. ఓ సెలెబ్రెటీ తన అసిస్టెంట్ ద్వారా చేసిన అభ్యర్థన మేరకు ఇంటర్వ్యూ చివరి నిమిషంలో తన గురించి ప్రస్తావించినట్లు నిర్వాహకులు తెలియజేశారని వివరించారు.

మైక్రోఫోన్ ఒక వ్యాఖ్యను తెలివైనదిగా లేదా హాస్యాస్పదంగా మార్చబోదని, అది తన అవివేకాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేస్తుందని పార్తీబన్ ను ఉద్దేశించి చెప్పారు. జ్ఞానం లేకుండా మాట్లాడే అనాగరిక పదాలు వాటిని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి కంటే మాట్లాడిన వ్యక్తి గురించే ఎక్కువ చెడ్డగా చెబుతాయని త్రిష తన ప్రకటనలో స్పష్టం చేశారు.

త్రిష ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే పార్థిబన్ స్పందించారు. తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆమెకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉందని గుర్తించినట్లు వివరించారు. ఆ వ్యాఖ్యల వల్లే తప్పు అంతా జరిగిందని, ఇప్పుడు దీనికి విచారం వ్యక్తం చేయడమే తప్ప తనకు వేరే మార్గం లేదని పేర్కొన్నారు. బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+