ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.
ప్రెజెంటర్ ఇయాన్ బిషప్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు. సూపర్ 8లో వెస్టిండీస్ పై 97, రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై 89, ఫైనల్ లో న్యూజిలాండ్ పై మళ్లీ 89 పరుగులతో సత్తా చాటాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో 321 పరుగులు సాధించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్న అనంతరం భావోద్వేగానికి గురయ్యాడు. తన సక్సెస్ వెనుక గల సీక్రెట్స్ ను వెల్లడించాడు.

సచిన్ టెండుల్కర్ గైడెన్స్ వల్లే ఫామ్ ను అందిపుచ్చుకోగలిగానని అన్నాడు. కెరీర్‌లో ఫామ్ కోల్పోయిన కష్టకాలంలో టెండూల్కర్ మెంటార్ షిప్, ఆయన మార్గదర్శకత్వం తనకు ఎంతగానో సహాయపడిందని చెప్పాడు. ఫైనల్ విజయం అనంతరం ఈ క్షణం తన జీవితంలో ఓ కల నిజమైనట్లుగా అనిపించిందని వ్యాఖ్యానించాడు. తన భావాలను మాటల్లో వర్ణించలేకపోతున్నానని, ఇదంతా ఓ కలలా ఉందని పేర్కొన్నాడు.
ఫామ్ అందిపుచ్చుకోవడానికి రెండు సంవత్సరాల ముందు నుంచే కఠోరంగా శ్రమిస్తోన్నానని, టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోవడం.. దానికి దక్కిన ఫలితమేని సంజు శాంసన్ తెలిపాడు. 2024 వరల్డ్ కప్‌లో జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాలేదని గుర్తు చేశాడు. జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పటి నుండే నిరంతరం ఊహించుకుంటూ, కష్టపడుతూ వచ్చానని వివరించాడు.
అనుకున్నంతగా జాతీయ జట్టులో అవకాశాలు రాకపోవడంతో ఒక దశలో పూర్తిగా నిరాశకు గురయ్యానని శాంసన్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని, కలలు చెదిరిపోయినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ఏమి చేయాలో తోచలేదని, అలాంటి సమయంలో సచిన్ టెండుల్కర్ మెంటార్ షిప్ దోహదపడిందని చెప్పాడు. గొప్ప కలలు కనే ధైర్యం కలిగిందని, దాన్ని నిజం చేసుకున్నందుకు ఈ బహుమతి లభించిందని చెప్పాడు.
నిజానికి- ఈ వరల్డ్ కప్‌లో సంజు శాంసన్‌కు మొదట్లో అవకాశాలు లభించలేదు కూడా. అతన్ని జట్టు నుండి తప్పించింది మేనేజ్మెంట్. బెంచ్ కే పరిమితం చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. అయిదు మ్యాచ్‌లలోనే 321 పరుగులు సాధించాడు. ఇందులో వరుసగా మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ మూడు కీలకమైన అర్ధ సెంచరీలు కూడా నాకౌట్ మ్యాచ్‌లలోనే వచ్చాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications