Viral Video: బ్యాంకు మేనేజర్ చెంప పగలగొట్టిన కేంద్ర మాజీ మంత్రి కూతురు!
Viral Video: తమిళనాడు రాజధాని చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడయార్ బ్రాంచ్ లో జరిగిన వివాదం సంచలనంగా మారింది. ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్‌పై మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తై కయల్విళి దాడికి పాల్పడిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు ఆ ఆవరణలోని సీసీటీవీలో స్పష్టంగా రికార్డుయ్యాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే?
ఎస్బీఐ అడయార్ బ్రాంచ్ ఉన్న కమర్షియల్ బిల్డింగ్ మాజీ కేంద్ర మంత్రి కూతురు కయల్విళికి చెందినది. గత కొన్ని రోజులుగా ఆ భవనంలోని లిఫ్ట్(ఎలివేటర్) సరిగ్గా పనిచేయకపోవడంతో వచ్చే కస్టమర్లకు, బ్యాంకు సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య గురించి మాట్లాడేందుకు బ్యాంక్ మేనేజర్ కయల్విళి వద్దకు వెళ్లారు. పాడైన లిఫ్ట్ ను త్వరగా రిపేర్ చేయించాలని ఆయన కోరడంతో ఇద్దరి మధ్య చిన్నగా ప్రారంభమైన మాటల యుద్ధం కాస్త తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలో కయల్విళి ఒక కార్యాలయంలా కనిపించే చోట ఒక వ్యక్తితో కలిసి కూర్చుని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజర్‌తో వాగ్వాదం చేస్తున్నట్లు కనిపించింది. చర్చలు జరుగుతుండగా వాగ్వాదం జరగడంతో, కయల్విళి అకస్మాత్తుగా లేచి బ్యాంక్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. ఆకస్మికంగా జరిగిన ఈ దాడిలో బ్యాంక్ మేనేజర్ అవాక్కయ్యారు.
కేసు నమోదు
ఈ ఘటన అనంతరం బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అడయార్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీని సాక్ష్యంగా తీసుకుని, చట్టంలోని నాలుగు సెక్షన్ల కింద కయల్విళిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న అధికారిపై దాడికి దిగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
M.K. Alagiri daughter, Kayalvizhi Alagiri slapped the Bank manager @subashprabhu pic.twitter.com/s4Ti2WeeQT
— Vignesh Theni (@Vignesh_twitz) July 25, 2026












Click it and Unblock the Notifications