ప్రత్యక్ష సంచారంలోకి బుధుడు.. ఆగస్ట్ 5వరకు ఈ రాశులకు శుభాలు, లాభాలు!

2026, జూలై 27వ తేదీ నుండి గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తిరోగమన సంచారం నుండి సవ్య దిశలో సంచారం ప్రారంభిస్తాడు. మిధున రాశిలో బుధుడు సబి దిశలో సంచారం ప్రారంభించడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జూలై 27 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు తెలివితేటలు, సమయస్ఫూర్తి, బుద్ధికి కారకుడైన బుధుడు సవ్య దిశా సంచారం వలన లబ్ధిని పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి

వృషభ రాశి జాతకులకు బుధుడు ప్రత్యక్ష సంచారం అదృష్టాన్ని కలిగిస్తుంది. ధన స్థానంలో బుధుడు సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతోనే ఆదాయ లాభాలు జరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థికపరమైన, వ్యక్తిగత సమస్యల నుండి వృషభ రాశి వారు బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో పోటీదారుల పై పై చేయి సాధిస్తారు. పెండింగ్ పనులు, ఒప్పందాలు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

Mercury turns direct on July 27 these zodiac signs will get good health wealth and happiness

మిధున రాశి

మిధున రాశి వారికి అధిపతి అయిన బుధుడు స్వస్థానంలో ఉండడంవల్ల వీరికి ఆదాయ వృద్ధి జరుగుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. షేర్లు స్పెక్యులేషన్ వ్యాపారాలు చేసేవారు లాభాలు గడిస్తారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.

సింహరాశి
సింహ రాశి వారికి లాభ స్థానంతో బుధ సంచారం కారణంగా ఉద్యోగంలో వారికి గుర్తింపు వస్తుంది. సమయంలో హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలు రాసే వారికి విజయం వరిస్తుంది.

కన్యారాశి

కన్యా రాశి వారికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగపరంగా అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ ఆఫర్లు వస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో కన్యా రాశి వారికి నైపుణ్య వృద్ధి జరుగుతుంది.

తులారాశి

తులా రాశి వారికి భాగ్య స్థానంలో బుధ సంచారం కారణంగా సానుకూల ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలలో ఉన్న వారికి పదోన్నతులు కలుగుతాయి. ఆర్థిక సమస్యల పరిష్కారమే రాబడి పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ లు లాభదాయకంగా ఉంటాయి.

కుంభరాశి

కుంభరాశి వారికి పంచమ స్థానంలో బుధ సంచారం కారణంగా ఆర్థిక లావాదేవీలు అదృష్టాన్ని ఇస్తాయి. షేర్లు లాభాలను కురిపిస్తాయి. విదేశీ వ్యవహారాలు చూసే వారికి కలిసి వస్తుంది. మంచి పరిచయాలు పెరుగుతాయి. సంతాన యోగం ఉంటుంది. ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+