గజకేసరి యోగంతో మీరు పట్టిందల్లా బంగారం, ఇవ్వాళ వీరికి సంపదల వర్షం!

జూలై 26 ఆదివారం రోజు సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రంలో ఈరోజు ఉదయం ఏడు గంటల 34 నిమిషాలకు గురు గ్రహం అధిపతిగా ఉన్న ధనుస్సు రాశి లోకి చంద్రుడు ప్రవేశం చేస్తున్నాడు. గురు రాశిలో చంద్రుడు సంచారం గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన యోగం.

నేడు గ్రహాల స్థితి ఇలా

మిధున రాశిలో బుధుడు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తాడు. ధనుస్సు రాశిలో చంద్రుడు మానసిక భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తాడు. ఇక నేడు ఆదివారం రోజు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

today rashiphalalu Career and finance horoscope for July 26 2026 Gajakesari Yoga brings success

మేషరాశి: జులై 26వ తేదీన మేషరాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మేష రాశి వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం కంటే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను మెరుగుపరచడం పైన దృష్టి సారించాలి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభరాశి: నేడు వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అయితే ఆలోచించకుండా ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది మీ శ్రమను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూసే వారికి సానుకూల సంకేతాలు ఉన్నాయి.

మిధునరాశి: మిధున రాశి వారికి నేడు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అయితే ఒత్తిడిలో ఎటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.

కర్కాటకరాశి: కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. పనిలో మీ బాధ్యతలు పెరుగుతాయి. అయితే మీ పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు.

సింహరాశి: సింహ రాశి వారికి ఆదివారం సంతోషకరమైన రోజు. నేడు శుక్రుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు. విలాస వస్తువుల పైన మీ ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఊహించని లాభాలను తీసుకువస్తాయి. ఒంటరిగా పనిచేయడం కంటే అందరితో కలిసి పనిచేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్యారాశి: కన్యా రాశి వారికి మంచి ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. జాతకులు పుకార్ల ఆధారంగా డబ్బు పెట్టుబడి పెట్టకూడదు. దీర్ఘకాలంలో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా బలోపేతం అవుతుంది. అకౌంటింగ్, విద్యా రంగాలలో ఉన్నవారు అసాధారణంగా రాణిస్తారు.

తులారాశి: నేడు తులా రాశి వారి జీవితం స్వర్ణమయం అవుతుంది. ఆర్థిక బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఏర్పరచుకున్న కొత్త వ్యాపార పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.ఇతరుల ప్రభావంతో రిస్కు ఉన్న పెట్టుబడులు పెట్టడం మానుకుంటే మంచిది.

వృశ్చికరాశి: నేడు వృశ్చిక రాశి జాతకులు డబ్బుకు సంబంధించి అనవసరమైన ఆందోళనలు చూస్తారు. భావోద్వేగంతో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. నేడు మీ ఖాతాలను సరిగ్గా ఉంచుకోవడం పైన భవిష్యత్తు ఖర్చులకోసం ప్రణాళిక వేసుకోవడం పైన దృష్టి పెడితే మంచిది.

ధనుస్సురాశి: ధనుస్సు రాశి వారికి నేడు ఉత్తమమైన రోజు. సురక్షితమైన పెట్టుబడులు మీ ఆర్థిక స్థితిని నేడు బలపరుస్తాయి. ఆచితూచి నిర్ణయించుకుని తీసుకునే ప్రణాళిక మీకు లాభాలను చేకూరుస్తుంది.

మకరరాశి: నేడు మకర రాశి జాతకులు క్రమశిక్షణ ఉంటూ ఉండాల్సిన అవసరం ఉంది. వీరికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారు ఒంటరిగా కాకుండా టీం వర్క్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు.

కుంభరాశి: నేడు కుంభ రాశి వారికి ప్రశాంతమైన సమయం. వృత్తిపరమైన పరిచయాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఆశాజనకమైన మార్గాలు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే తెలివి తక్కువ పనులు చేయడం మానుకోవాలి. పనిచేసే చోట మీరు మంచి పేరును సాధిస్తారు. ఉన్నతాధికారులు మీకు కష్టాన్ని గమనిస్తారు.

మీనరాశి: మీన రాశి వారికి నడుము మిశ్రమ సమయం. నేడు నైపుణ్యాలను మీరు మెరుగుపరుచుకోవడానికి సరైన సమయం తొందరపడి పరిచయం లేని చోట్ల డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+